సైబర్‌ మోసగాళ్లతో జర జాగ్రత్త

ABN , First Publish Date - 2020-04-05T10:20:18+05:30 IST

సైబర్‌ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ శనివారం ఒక ప్రకటనలో

సైబర్‌ మోసగాళ్లతో జర జాగ్రత్త

సిద్దిపేట క్రైం,ఏప్రిల్‌ 4: సైబర్‌ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. రానున్న మూడునెలల వరకు ఈఎమ్‌ఐలపై ఆర్బీఐ మారిటోరియం ప్రకటించిందని, దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ మోసగాళ్లు ఫోన్‌, మెసేజ్‌, మెయిల్‌ చేసే అవకాశముందని అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సీపీ హెచ్చరించారు. బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు, ఓటీపీ నంబర్‌ వంటి వివిరాలేవీ వెల్లడించొద్దని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేస్తే కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌ 7901100100కు సంప్రదించాలని సీపీ కోరారు.

Updated Date - 2020-04-05T10:20:18+05:30 IST