Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్త జన సంద్రం.. శ్రీముఖలింగం

జలుమూరు: దక్షిణకాశీ శ్రీముఖలింగం భక్త జనసంద్రంతో నిండిపోయింది. కార్తీకమాసం చివరి ఆదివారం కావడంతో స్వామిని దర్శించుకునేందుకు జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఒడిశా నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.  తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద బారులుదీరారు. ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనం క్యూ లు కూడా భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగణంలో దేవదాయశాఖ అధికారులు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు. 

 

Advertisement
Advertisement