Advertisement
Advertisement
Abn logo
Advertisement

విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ దందా: భూమా అఖిలప్రియ

కర్నూలు: రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ దందా కొనసాగుతోందని టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ మండలం, ఆర్.క్రిష్ణాపురం గ్రామంలో గత కొన్ని నెలల నుంచి  అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని ఆరోపించారు. అనుమతి ఒక సర్వే నెంబర్‌కు ఇస్తే.. వేరే సర్వే నెంబర్‌లో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారని విమర్శించారు. పుల్లయ్య అనే వ్యక్తి పేరు మీద ఎకరాకు అనుమతి తీసుకొని, మరికొన్ని ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వుతున్నారన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చెరువులను తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని భూమా అఖిలప్రియ మండిపడ్డారు.

Advertisement
Advertisement