Advertisement
Advertisement
Abn logo
Advertisement

బోయినపల్లి పోలీసులపై కేపీహెచ్‌బీ పీఎస్‌లో అఖిలప్రియ ఫిర్యాదు

హైదరాబాద్: బోయినపల్లి పోలీసులపై ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జులై 6వ తేదీన 10 మంది పోలీసులు తమ ఫ్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన సీసీ పుటేజీనీ పోలీసులకు అందజేశారు. నకిలీ కోవిడ్ రిపోర్టుతో కేసు విచారణకు హాజరు కాకుండా భార్గవ్ రామ్ తప్పించుకు తిరుగుతున్నారని, అందుకే తాము ఇంటికి వెళ్లామని బోయినపల్లి పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement