Abn logo
Jan 14 2021 @ 13:45PM

గాంధీకి అఖిల ప్రియ..రోగుల ఇబ్బందులు

హైదరాబాద్: బోయిన్‌పల్లి కేసులో ఏ1 నిందితురాలుగా ఉన్న అఖిల ప్రియను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తీసుకువచ్చారు. అయితే అఖిలప్రియ వైద్య పరీక్షల దృశ్యా గాంధీ ఆసుపత్రిలో ఇతర రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు అఖిల ప్రియ వైద్య పరీక్షలు జరుగుతున్న క్రమంలో ఇతర రోగులను ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతించని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement