చెట్లకు రాఖీ కట్టిన సీఎం నితీశ్

ABN , First Publish Date - 2021-08-22T20:29:30+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాఖీ పండుగ

చెట్లకు రాఖీ కట్టిన సీఎం నితీశ్

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాఖీ పండుగ సందర్భంగా చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణాన్ని పరరిక్షించవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2012 నుంచి ఈ పండుగను ‘వృక్ష రక్షా దివస్’గా నిర్వహిస్తోంది. 


నితీశ్ కుమార్ మాట్లాడుతూ, అందరూ పర్యావరణాన్ని కాపాడాలని, ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని చెప్పారు. 2012 నుంచి తన ప్రభుత్వం రక్షా బంధన్‌ను వృక్ష రక్షా దివస్‌గా నిర్వహిస్తోందని చెప్పారు. మొక్కలు నాటి, వాటిని కాపాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 


రాష్ట్ర ప్రభుత్వం జల జీవన్ హరియాలీ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మొక్కలను నాటడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. పర్యావరణ పరిరక్షణ పట్ల భావి తరాలకు అవగాహన కల్పించడం ఈ పథకం లక్ష్యం. 


అన్నాచెల్లెళ్ళ ఆత్మీయానురాగాలకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. 

Updated Date - 2021-08-22T20:29:30+05:30 IST