టీఆర్‌ఎస్‌లో ద్విదశాబ్ధి జోష్‌

ABN , First Publish Date - 2021-10-24T05:42:46+05:30 IST

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ద్వి దశాబ్ధి ఉత్సవాల జోష్‌ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు జరిగిన సంస్థాగత ఎన్నికల్లో వార్డు, గ్రామ, నియోజకవర్గ, పట్టణ కమిటీలు, అనుబంధ కమిటీల పదవులను దక్కించుకున్న నేతలు త్వరలో జరగ నున్న ద్విదశాబ్ధి ఉత్సవం, టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, సన్నాహక సమావేశాలతో తొలి బాధ్యతలను నిర్వర్తించడానికి సమాయత్తం అవుతున్నారు.

టీఆర్‌ఎస్‌లో ద్విదశాబ్ధి జోష్‌

జగిత్యాల, కోరుట్ల నేతలకు ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ దిశా నిర్ధేశం

25వ తేదీన రాజధానిలో ప్లీనరీ

27నసెగ్మెంట్‌ కేంద్రంలో సన్నాహక సమావేశాలు

28 నుంచి మండలాలు, పట్టణాల్లో...

వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో విజయ గర్జన

జగిత్యాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ద్వి దశాబ్ధి ఉత్సవాల జోష్‌ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు జరిగిన సంస్థాగత ఎన్నికల్లో వార్డు, గ్రామ, నియోజకవర్గ, పట్టణ కమిటీలు, అనుబంధ కమిటీల పదవులను దక్కించుకున్న నేతలు త్వరలో జరగ నున్న ద్విదశాబ్ధి ఉత్సవం, టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, సన్నాహక సమావేశాలతో తొలి బాధ్యతలను నిర్వర్తించడానికి సమాయత్తం అవుతున్నారు. టీఆర్‌ ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి జగిత్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికే దిశ నిర్ధేశం చేశారు. రాష్ట్ర రాజధానిలోని తెలంగాణ భవన్‌లో ఇటీవల జిల్లాలోని జగి త్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌లు, జడ్పీ చైర్‌పర్సన్‌, జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, వరంగల్‌ విజయ గర్జన సభ, నియోజకవర్గాల్లో జర పాల్సిన సన్నాహక సమావేశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సల హాలు, సూచనలు, ఆదేశాలను మంత్రి కేటీఆర్‌ జారీ చేశారు. అధి ష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాలతో పాటు చొప్పదండి, వేములవాడ నియోజక వర్గాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు ద్విదశాబ్ధి ఉత్సవానికి జనం తర లింపు, సన్నాహక సమావేశాలు నిర్వహించడంపై వ్యూహ రచన చేస్తు న్నారు. 

ప్లీనరీ, సన్నాహక సమావేశాలపై దృష్టి....

టీఆర్‌ఎస్‌ను పల్లెపల్లెన మరింత బలోపేతం చేయాలన్న మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు జిల్లాలో అవసరమైన కార్యక్రమాలను నిర్వహిం చడానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఈనెల 25వ తేదిన హైద్రాబాద్‌లో జరగనున్న ప్లీనరీకి జిల్లాలోని ఆయా నియోజక వర్గాల నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు ఆహ్వానం అందుకున్న పలువురు నేతలు తరలివెళ్లనున్నారు. టీఆర్‌ఎస్‌ వ్యవ స్థాప కులు, సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని మరో మారు బలపరిచి పార్టీ అధ్య క్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకోవడం ప్లీనరీలో లాంచనంగా మారనుంది. అనంతరం కేసీఆర్‌ పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిం చనున్నారు. ప్లీనరీ అనంతరం ఈనెల 27వ తేదీన జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గ కేంద్రాల్లో ద్విదశాబ్ధి ఉత్సవ సన్నాహక సమావే శాలను నిర్వహించడానికి ప్రణాళిక రచించారు. ఆయా నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి పార్టీ నేతలు, బాధ్యులను రప్పించి సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. ప్ర తీ గ్రామం, ప్రతీ వార్డు నుంచి 50 మందికి తగ్గకుండా హాజరయ్యేలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. విజయ గర్జన సభను విజయవంతం చేయ డానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై సన్నాహక సమావేశాల్లో ప్రణాళిక ఖరారు చేయనున్నారు. తదుపరి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలను నిర్వహించడానికి స మాయత్తం అవుతోంది. 

సుమారు 30 వేల మంది తరలింపునకు యత్నం...

వరంగల్‌లో జరగనున్న విజయ గర్జన సభకు జనాన్ని, కార్యకర్తలను తరలించడంపై ముందస్తు ప్రణాళికలను టీఆర్‌ఎస్‌ నేతలు నిర్వహిస్తు న్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌, మం త్రి కేటీఆర్‌ జగిత్యాల, కోరుట్ల నేతలతో ప్రత్యేక సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్లీనరీ అనంతరం నియోజకవర్గాల్లో సన్నాహక స మావేశాలను నిర్వహించి కార్యకర్తల తరలింపుపై అవసరమైన జాగ్రత్తల ను తీసుకోవడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విజయ గర్జన సభకు జిల్లా నుంచి సుమారు 30 వేల మంది కార్యకర్తలు, జనాన్ని తరలించ డమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి 160 బస్సులలో సుమారు 8 వేల మంది, కోరుట్ల నియోజకవర్గం నుంచి 160 బస్సులలో, ఇతర వాహనాల్లో సుమారు 8 వేల మంది, ధర్మపురి నియోజకవర్గం నుంచి 8 వేల మందిని తరలించాలన్న లక్ష్యంతో టీఆర్‌ ఎస్‌ నేతలు ముందుకు వెళ్తున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధి లోని కథలాపూర్‌, మేడిపల్లి మండలాలు, చొప్పదండి నియోజకవర్గం లోని మల్యాల, కొడిమ్యాల మండలాల నుంచి 100 బస్సులు, ఇతర వా హనాల్లో సుమారు 6 వేల మందిని తరలించాలన్న వ్యూహంతో టీఆర్‌ ఎస్‌ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఇటీవల సంస్థాగ త ఎన్నికల్లో పదవులను పొందిన పలువురు చోటా మోటా నేతలు ఆయా గ్రామాలు, మండలాల బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

సీఎం కేసీఆర్‌ ఆలోచనలను అమలు చేస్తాం

- కొప్పుల ఈశ్వర్‌, మంత్రి

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు టీఆర్‌ఎస్‌ మరింత బలోపే తానికి సీఎం కేసీఆర్‌ ఆలోచనలను పక్కాగా అమలు చేస్తాము. ప్లీనరీ, ద్వి దశాబ్ధి వరంగల్‌ విజయ గర్జన సభ, సన్నాహాక సమావేశాల ని ర్వహణపై ఇప్పటికే వ్యూహ రచన పూర్తి చేశాము. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నేతలతో సమావేశం నిర్వహించారు.

లక్ష్యం మేరకు జన సమీకరణ

- డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే

వచ్చే నెల 15వ తేదిన వరంగల్‌లో నిర్వహించనున్న విజయ గర్జన సభకు జగిత్యాల నుంచి లక్ష్యం మేరకు జన సమీకరణ జరుపుతాము. ఇందుకు అనుగుణంగా ఈనెల 27వ తేదన జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో సన్నాహక సమావేశం, తదుపరి గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో సమావేశాలను నిర్వహించడానికి నిర్ణయించాము.


అధిష్టానం ఆదేశాలను పాటిస్తాం

- కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, కోరుట్ల ఎమ్మెల్యే

అధిష్టానం నుంచి వస్తున్న ఆదేశాలను తప్పకుండా పాటిస్తాం. రాజధానిలో నిర్వహించనున్న ప్లీనరీ, నియోజకవర్గంలో నిర్వహించాల్సిన సన్నాహక సమావేశాలు, ద్వి దశాబ్ధి ఉత్సవం సందర్బంగా వరంగల్‌లో జరుపనున్న విజయ గర్జన సభకు జనం తరలింపులపై పక్కా ప్రణాళిక తో ముందుకు వెళ్తున్నాము. టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేస్తాము.

Updated Date - 2021-10-24T05:42:46+05:30 IST