కరోనా టీకా తర్వాత మలేరియా వ్యాక్సిన్‌పై బయోఎన్‌టెక్ దృష్టి!

ABN , First Publish Date - 2021-07-27T15:35:12+05:30 IST

జర్మనీ ఫార్మా కంపెనీ బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన...

కరోనా టీకా తర్వాత మలేరియా వ్యాక్సిన్‌పై బయోఎన్‌టెక్ దృష్టి!

బెర్లిన్: జర్మనీ ఫార్మా కంపెనీ బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించింది. ఈ కంపెనీ మలేరియా టీకా కోసం ఎంఆర్ఎన్ఏ టెక్నిక్‌ను ఉపయోగించనుంది. బయోఎన్‌టెక్ సంస్థ 2022 చివరినాటికల్లా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభించాలనే లక్ష్యం పెట్టుకుంది. 


బయోఎన్‌టెక్ చేపడుతున్న మలేరియా ప్రాజెక్టు ‘ఎరాడికేట్ మలేరియా’ ప్రచారంలో భాగం. దీనిని కెనప్ ఫౌండేషన్ చేపడుతోంది. దోమల కారణంగా వ్యాపించే వ్యాధులను అంతం చేయడమే ఈ ప్రచార లక్ష్యం. ఈ ప్రచారానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆఫ్రికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మద్దతునిస్తున్నాయి.

Updated Date - 2021-07-27T15:35:12+05:30 IST