Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 17:58PM

2015లో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన రావత్

న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆరేళ్ల క్రితం కూడా హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి తృటిలో బయటపట్టారు. తాజాగా ఆయన తమిళనాడులోని కూనూరు సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా నీలగిరి హిల్స్‌లో కుప్పకూలింది. వీరిలో 13 మంది చనిపోయినట్లు చెబుతుండగా, ప్రమాదంలో గాయపడిన బిపిన్ రావత్‌ను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలుండటంతో డీఎన్‌ఏ టెస్టులు చేస్తున్నారు.

నాటి ఘటన...

బిపిన్ రావత్ 2015 ఫిబ్రవరి 3న చీతా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఆ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో ఆయన లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్నారు.

Advertisement
Advertisement