Abn logo
Oct 13 2021 @ 19:09PM

Viral Video: 550 కేకులు కట్ చేసిన బర్త్‌డే బాయ్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

పుట్టినరోజు, పెళ్లిరోజులు జీవితంలో గుర్తుంచుకునే శుభకార్యాలు. అందుకే ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఖర్చుకు వెనుకాడకుండా ఆర్భాటంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొందరు అందరిలా కాకుండా ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. అంతా తమ గురించే మాట్లాడుకోవాలనే తపనతో విభిన్నంగా చేస్తూ ఉంటారు. పుట్టిన రోజు అంటే కేక్ కట్ చేయడం, స్నేహితులకు పార్టీ ఇవ్వడమే చాలామందికి తెలుసు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. తన పుట్టిన రోజు చర్చనీయాంశంగా ఉండాలనుకున్నాడో ఏమో.. ఏకంగా 550 కేకులు కోసి.. తన బర్త్‌డేను నెట్టింట హాట్ టాపిక్‌గా మార్చేశాడు.

మహారాష్ట్రలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని కందివలి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో సూర్య రాతూరి అనే వ్యక్తి ఒకేసారి 550 కేకులు కట్ చేసి తన పుట్టిన రోజును ఘనంగా చేసుకున్నాడు. మూడు పెద్ద టేబుల్స్‌పై 550 రంగు రంగుల కేకులను ఏర్పాటు చేశారు. తర్వాత సూర్య తన రెండు చేతులతో కత్తి తీసుకుని కేక్‌ను ఒక్కొక్కటిగా కట్ చేశాడు. ఈ కార్యక్రమానికి చాలా మంది హాజరయ్యారు. అయితే ఎవరూ కొవిడ్ నిబంధనలు పాటించలేదు. వీడియో వైరల్ అవడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...