Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 8 2021 @ 20:21PM

ఎన్నికల రాష్ట్రాలకు ఇంచార్జీలను ప్రకటించిన బీజేపీ

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ నుంచి ఇంచార్జీలను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. కేంద్ర మంత్రులు దర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, గజేంద్ర సింగ్ షేకావత్ సహా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఐదు రాష్ట్రాలకు బీజేపీ ఇంచార్జ్‌లుగా వ్యవహరించనున్నారు.


ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు 2022లో ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. పంజాబ్‌ను మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల్లో తమ అధికారిన్ని తిరిగి నిలబెట్టుకోవడం బీజేపీకి అసలు సవాల్‌గా మారింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఇంచార్జిగా నియామకం అయ్యారు. కాగా ఈయన టీంలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్ శోభా కరంద్లాజే, అన్నపూర్ణ దేవి, హర్యానా మంత్రి కెప్టెయిన్ అభిమన్యు, రాజ్యసభ సభ్యులు వివేక్ ఠాకూర్, సరోజ్ పాండేలు ఉన్నారు.


గొవా ఎన్నికల ఇంచార్జ్‌గా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నియామకం అయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్శన జోర్దాన్‌లు సహా ఇంచార్జీలుగా ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్‌ ఎన్నికల ఇంచార్జీగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని నియమించారు. ఈయనకు అనుబంధంగా ఎంపీ లాకెట్ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్‌లు సహా ఇంచార్జీలుగా నియామకం అయ్యారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌ను పంజాబ్ ఎన్నికల ఇంచార్జీగా నియమించారు. కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, మీనాక్షి లేఖి, ఎంపీ వినోద్ చావ్లాలు గజేంద్ర సింగ్‌కు సహాయకులుగా నియామకం అయ్యారు.

Advertisement
Advertisement