Abn logo
Oct 24 2020 @ 09:38AM

మెహబూబా ముఫ్తీని అరెస్ట్ చేయాలి : బీజేపీ

Kaakateeya

శ్రీనగర్ : ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకూ జాతీయ జెండాను ఆవిష్కరించమన్న మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ విషయంపై బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ... ‘‘ముఫ్తీ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజా సిన్హాను కోరుతున్నా. ఆమె చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం వ్యాఖ్యలు. ఆమెను దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేయాలి. జాతీయ జెండా కోసం, దేశం కోసం తమ జీవితాలను, రక్తాన్ని చిందిస్తాం. జమ్మూ కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం. అందుకే జాతీయ జెండాను ఎగరేయాలి. అది మన జాతీయ జెండా.’’ అని రవీందర్ రైనా డిమాండ్ చేశారు.


జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా తిప్పికొట్టలేమన్నారు. కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టవద్దని గతంలోనే తాము ముఫ్తీ లాంటి నేతలందర్నీ కోరినట్లు ఆయన గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్ లో శాంతి నెలకొందని, దానిని చెదరగొట్టేందుకు ఎవరూ ప్రయత్నించినా తాము సహించమని రవీందర్ రైనా హెచ్చరించారు. 

Advertisement
Advertisement