గార్బేజ్ ఏర్పాటుపై బీజేపీ ధర్నా
ABN , First Publish Date - 2021-08-03T06:06:58+05:30 IST
పట్టణంలోని మోడల్ కాలనీలో చెత్తకోసం గార్బేజ్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని బీజేపీ నాయకులు అన్నారు.

హిందూపురం టౌన, ఆగస్టు 2: పట్టణంలోని మోడల్ కాలనీలో చెత్తకోసం గార్బేజ్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని బీజేపీ నాయకులు అన్నారు. సోమవారం మోడల్ కాలనీవాసులతో కలిసి బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంతసేపటికీ కమిషనర్ బయటికి రాకపోవడంతో బైపా్‌సరోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన ఇంద్రజ, వైస్ చైర్మన జబీవుల్లాలు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యపై మెమోరాండం ఇచ్చేందుకు మునిసిపల్ కార్యాలయం వద్దకు వస్తే కమిషనర్ బయటకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, నాయకులు రమే్‌షరెడ్డి, వరప్రసాద్, ఆదర్వ్, రవితేజరెడ్డి, ఉదయ్, శంకర్, వెంకటరామిరెడ్డి, గజేంద్ర, మోహన, టీకేబాబు, స్థానికులు హనుమంతు, బసవరాజు, వలీఖాన, వినయ్, పాటిల్, తదితరులు పాల్గొన్నారు.