Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాసేపట్లో జిల్లాల పర్యటనకు బయలుదేరనున్న Bandi sanjay

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో తాడేపేడో తేల్చుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల బాట పట్టనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి జిల్లాల పర్యటనకు బండి సంజయ్ బయలుదేరనున్నారు. నేడు నల్లగొండ, రేపు సూర్యపేట జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు పర్యటించనున్నారు. అర్జాలబావి ఐకేపీ సెంటర్(నల్గొండ రూరల్ మండలం)ను బండి సంజయ్ సందర్శించనున్నారు.  మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు. నేటి రాత్రికి సూర్యాపేటలో బస చేయనున్న బండి సంజయ్... మంగళవారం తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు. మార్కెట్‌లో ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర, రైతులు పడుతోన్న కష్టాలను బండి సంజయ్  తెలుసుకోనున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement