Abn logo
Sep 15 2021 @ 11:15AM

మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డ డీకే అరుణ

జోగులాంబ గద్వాల: మంత్రి కేటీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాల్మీకి బోయలను ఎస్టీలో కలిపిన రాష్ట్ర తీర్మానం కాపీని చూపించాలని... లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అబద్దాలలో తండ్రిని మించిన తనయుడవు అయ్యావని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో వాల్మీకులు, బోయల తీర్మానాన్ని, గద్వాలకు మెడికల్ కళాశాల కాపీ తీర్మానాలను కేంద్రానికి పంపించాలని... కేంద్రంతో మాట్లాడి తీర్మానాలను అమలు చేసేలా కృషి చేస్తానని డీకే అరుణ పేర్కొన్నారు.