Abn logo
Jul 17 2021 @ 14:06PM

కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: Etela Rajender

కరీంనగర్: కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...హుజురాబాద్ ఒక్కటే కాదు అంతటా ఇలాంటి పరిస్థితి ఉందని తెలిపారు. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరన్నారు. ప్రజల్లో బలమున్నవారు ఇలా చెయ్యరని చెప్పారు. ఎస్సీల జనాభా 16-17 శాతం ఉంటుందని.... కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాల, మాదిగలలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారన్నారు. 0.5శాతం ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. . ఎదురుదాడులకు, చిల్లరదాడులకు భయపడబోమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.