Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘‘నిజాంలాగా నువ్వు, నీ కొడుకు, నీ మనవడి రాజ్యం కాదు కేసీఆర్’’

కరీంనగర్: టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడేవన్నీ అబద్ధాలే అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. పదవులు ఇచ్చారని, అవమానించి బయటికి పంపించారని విమర్శించారు. కేసీఆర్ అబ్బ జాగీరు కాదని.. పెన్షన్, రేషన్ కార్డులు పోవడానికి. అది మన సొమ్ము అని అన్నారు. ప్రజల హక్కు హరించడానికి కేసీఆర్‌ ఎవరు అని ప్రశ్నించారు.  రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నావు కదా కేసీఆర్... 65 రోజులుగా ఎందుకు దళిత బంధు ఇవ్వలేదని నిలదీశారు. అర చేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నరని మండిపడ్డారు. ‘‘నన్ను సాదుకుంటారా?..చంపుకుంటారా?... నా ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్‌తో కొట్లాడతా’’ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ‘‘ఎమ్మెల్సీల్లార మీకు సిగ్గు ఉందా? ఇందుకా మీ ప్రజలు ఓట్లు వేసింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిజాంలాగా నువ్వు, నీ కొడుకు, నీ మనవడి రాజ్యం కాదు కేసీఆర్’’ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement