‘పీఎం పోషణ్’‌ను ‘జగనన్న గోరుముద్ద’గా మార్చడాన్ని ప్రజలు గమనించాలి: లంకా

ABN , First Publish Date - 2021-09-30T18:10:20+05:30 IST

"పీఏం పోషణ్" బడికి వెళ్లే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంను మరో 5 సంవత్సరాలు కొనసాగిస్తూ కేంద్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

‘పీఎం పోషణ్’‌ను ‘జగనన్న గోరుముద్ద’గా మార్చడాన్ని ప్రజలు గమనించాలి: లంకా

అమరావతి: "పీఏం పోషణ్" బడికి వెళ్లే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంను మరో 5 సంవత్సరాలు కొనసాగిస్తూ  కేంద్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. "పీఏం పోషణ్" పథకాన్ని అలియాస్ "జగనన్న గోరు  ముద్ద"గా స్టిక్కర్ వేయడాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. విద్యార్థులకు పోషకాహారం కోసం కేంద్రం సహాయం చేస్తుంటే, జగన్ జేబులో డబ్బు ఖర్చు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. పత్రికలలో ప్రకటనలకు మాత్రం పరిమితమై, కేంద్రం సహాయం చేస్తున్నా, పిల్లలకు నాణ్యమైన ఆహారం పెట్టకుండా రాష్ట్రంలో దోచుకుతింటున్నారని ఆరోపించారు. పిల్లల నోటి కాడ కూడు లాగేస్తూ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు అవినీతిమయం అయ్యారని లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-09-30T18:10:20+05:30 IST