Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని బీజేపీ నాయకుల ధర్నా

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌ టౌన్‌/లింగాపూర్‌/దహెగాం, నవంబరు 30: జిల్లా వ్యాప్తంగా మంగళవారం డీజిల్‌, పెట్రోల్‌ ఽధరలు తగ్గించాలని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో  బీజేపీ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ట్యాక్స్‌ తగ్గించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దీంతో వాహనదారులపై పెనుభారం పడుతుం దని,  వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకుల కాండ్రె విశాల్‌, రాధిక, వందన, స్రవంతి, సంతోష్‌, మెస్ని, పల్లవీ, వినో ద్‌, చింటు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పన్ను తగ్గించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించినా తెలంగాణ రాష్ట్రం తగ్గించడం లేదన్నారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాలని ఉద్దేశ్యంతో పన్నులు తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు సంతోష్‌, మాచర్ల శ్రీనివాస్‌, కృష్ణ స్వామి, చేరాల శ్రీనివాస్‌, మోహి, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు. లింగాపూర్‌లో బీజేపీ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో నాయకు లు రమేష్‌, శ్రీకాంత్‌చారి, చంద్రభాన్‌, రవీందర్‌, పినాజీ, లక్ష్మణ్‌, యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు. దహెగాం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూర్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్లే రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, సోమయ్య, సురేష్‌, నరేష్‌, లచ్చన్న, నీలేష్‌, పైకాజీ, సంతోష్‌, పోశం, నారాయణ, మల్లేష్‌, శంకర్‌, పెంటన్న, శ్రీను సింగ్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement