Abn logo
Aug 12 2021 @ 13:09PM

జగన్‌వి మోసపూరిత హామీలు: బాజీ

గుంటూరు: సీఎం వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి మోసపూరిత హామీలు ఇస్తున్నారని బీజేపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాజీ విమర్శించారు. బీజేపి మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం వారు ధర్నా నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ఎన్నో హామీలు ఇచ్చారని.. మోసపూరిత మాటలు నమ్మి ముస్లింలు ఓట్లు వేసి మోసపోయారన్నారు. అధికారంలోకి వచ్చాక ముస్లింలకు ఇచ్చే పెళ్లి కానుక అమలు చేయడం లేదన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టో‌లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లోగా ముస్లిం పెళ్ళి కానుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని బాజీ హెచ్చరించారు. బీజేపి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి , పలువురు మైనారిటీ నేతలు పాల్గొన్నారు.