Abn logo
Jan 18 2021 @ 02:04AM

హిందూ దేవుళ్లంటే అంత చులకనా!

‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌ సెన్సారింగ్‌ కోరుతూ కేంద్రమంత్రికి బీజేపీ ఎమ్మెల్యే లేఖ

ముంబై, జనవరి 17: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారమవుతున్న వెబ్‌సిరీ్‌సల్లో అశ్లీల సన్నివేశాలు పెరిగిపోయాయని, హింస, డ్రగ్స్‌ వాడకాన్ని ప్రోత్సహించేలా సన్నివేశాలు ఉంటున్నాయని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్‌కదమ్‌ అన్నారు. కొన్ని సిరీ్‌సలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. వీరికి హిందూ దేవుళ్లంటే ఎందుకంత చులకనో అర్థం కావడం లేదన్నారు. వీటికి సెన్సార్‌ లేకపోవడంతో.. ఇష్టారాజ్యంగా తయారయ్యాయని, వెబ్‌సిరీ్‌సల కోసం కూడా వెంటనే ఓ సెన్సార్‌ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు ఆయన ఓ లేఖ రాశారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ‘తాండవ్‌’ వెబ్‌సిరీ్‌సపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అందులో హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని, వారు హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని మండిపడ్డారు. అందులో నటించిన నటుడు సైఫ్‌అలీఖాన్‌, డింపుల్‌ కపాడియా, నిర్మాత, దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని కోరారు. 

Advertisement
Advertisement
Advertisement