‘‘కుమారుడు ఇంటికి వచ్చేశాడు’’.. ముకుల్ రాయ్ టీఎంసీలో చేరడంపై మమత

ABN , First Publish Date - 2021-06-11T22:35:04+05:30 IST

బీజేపీ నేత ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు

‘‘కుమారుడు ఇంటికి వచ్చేశాడు’’.. ముకుల్ రాయ్ టీఎంసీలో చేరడంపై మమత

కోల్‌కతా : బీజేపీ నేత ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు సుభ్రాంషు రాయ్ కూడా బీజేపీలో చేరారు. సీఎం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన తిరిగి తృణమూల్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ... ‘‘కుమారుడు తిరిగి సొంతింటికి చేరుకున్నాడు. ముకుల్ రాయ్ ఇంటి పిల్లవాడు. తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. పార్టీలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. బీజేపీలో చాలా దోపిడీ ఉంది. అందులో మనగలగడం ఇబ్బందే’’ అని మమత వ్యాఖ్యానించారు.


మరోవైపు కృష్ణా నగర్‌  శాసన సభ్యత్వానికి ముకుల్ రాయ్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ఆయన కుమారుడు సుభ్రాంషు రాయ్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. అయితే తృణమూల్‌లోకి రాక మునుపు ముకుల్ రాయ్ నాలుగు సార్లు సీఎం మమతతో ఫోన్లో చర్చించారు. లెక్క ప్రకారం ఎన్నికల కంటే ముందే ముకుల్ తృణమూల్‌లో చేరిపోవాలని భావించారు. బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో ఆయనకు పొసగక పోవడమే ఇందుకు కారణం. అయినా, కొన్ని రోజుల పాటు ముకుల్ బీజేపీలోనే ఉండిపోయారు. 



Updated Date - 2021-06-11T22:35:04+05:30 IST