పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నిరసనలు

ABN , First Publish Date - 2020-10-28T11:38:46+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, దుబ్బాక అభ్య ర్థి రఘునందన్‌రావుపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఐబీ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నిరసనలు

ఏసీసీ, అక్టోబరు 27:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌రావుపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఐబీ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ గోనె శ్యాంసుందర్‌రావు మాట్లాడుతూ దుబ్బాక అభ్యర్థి కుటుంబ సభ్యుల ఇండ్లపై దాడి చేయడం హేయమైన చర్య అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అని చూడకుండ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్‌రావు, రజనీష్‌ జైన్‌,  గోపతి మల్లేష్‌, వెంకటేశ్వర్‌రావు, హరికృష్ణ, వెంకటకృష్ణ, పాల్గొన్నారు. 


దండేపల్లి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌, మాజీ ఎంపీ గడ్డం వివేక్‌, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్ధి రఘనందన్‌రావుల అక్రమ అరెస్టులకు నిర సనగా బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఎస్సై శ్రీకాంత్‌ చేరుకొని అందరినీ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, నందుర్క్‌ సుగుణ, భూమేష్‌, గిరిధర్‌. రవి గౌడ్‌, శంకర్‌గౌడ్‌, కిషన్‌, వంశీ,  పాల్గొన్నారు.

 

నస్పూర్‌ : దుబ్బాకలో బండి సంజ య్‌పై దాడి ఘటనను నిరసిస్తూ సీసీసీ కార్నర్‌ వద్ద రాస్తారోకో చేసి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో రాకపోక లు నిలిచిపోయాయి. ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులకు పోలీసులు విరమిం పజేశారు.పట్టణ అధ్యక్షుడు రాజు,  రవి, శ్వేతా, ల్యాగల శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 


మందమర్రిటౌన్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్‌, అభ్యర్ధి రఘునంద న్‌రావులపై జరిగిన దాడి, మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి, జితేందర్‌ అరెస్టుకు నిరసనగా మందమర్రిలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, పోలీసుల కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణాధ్యక్షుడు మద్ది శంకర్‌, డీవీ దీక్షి తులు, అందుగుల లక్ష్మణ్‌, మురళీ, నగేష్‌, శ్రీనివాస్‌, రవిసాగర్‌, పాల్గొన్నారు. 


కోటపల్లి: సిద్దిపేట పోలీస్‌ కమిష నర్‌ను డిస్మిస్‌ చేసి కేసు నమోదు చే యాలని కోటపల్లిలో బీజేపీ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడంతో పాటు దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికార పార్టీ ఆదేశాలతో పోలీసులు బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు ఇంట్లో డబ్బులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. సిద్దిపేటకు వెళ్తున్న  బండి సంజయ్‌ను అడ్డుకుని సీపీ బలవంతంగా మెడపట్టి వాహనంలో నెట్టాడని, సీపీపై క్రిమినల్‌ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. పెద్దల సత్యం,  చిట్యాల మోహన్‌, దుర్గం నర్సింహులు, చంద్ర య్య, కిష్టయ్య, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 


రామకృష్ణాపూర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రఘునందన్‌ రావు లపై దాడిని ఖండిస్తూ మాజీ ఎంపీ వెంకటస్వామి, జితేందర్‌ రెడ్డిల అరెస్టుకు నిరసనగా సూపర్‌బజార్‌ సెంటర్‌ వద్ద కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షుడు మహంకాళి శ్రీనివాస్‌, ఆరు ముళ్ళ పోచంలు మాట్లాడుతూ సీపీని బదిలీ చేయాలని, ఎన్నికలను కేంద్ర బలగాల బందోబస్తుతో నిర్వహిం చాలని డిమాండ్‌ చేశారు. సంగె రవి, వెంకటి, రాజలింగు,  శ్యామ్‌ పాల్గొన్నారు. 


జైపూర్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యు లు గడ్డం వివేకానంద, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి రఘునందర్‌రావులపై దాడిని నిరసిస్తూ మండల పార్టీ అధ్యక్షుడు విశ్వంబర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొ మ్మ దహనం చేశారు. నగేష్‌, పోష న్నయాదవ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, పాల్గొన్నారు. 

 

బెల్లంపల్లి టౌన్‌:  బండి సంజయ్‌,  వివేక్‌ వెంకటస్వామి, దుబ్బాక ఎన్నికల ఇన్‌చార్జి జితేందర్‌ రెడ్డిల అరెస్టుకు నిరసనగా కాల్‌టెక్స్‌ ఫ్లైఓ వర్‌పై బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు రాస్తా రోకో చేయడంతో భారీ సంఖ్యలో వాహనాలు  నిలిచిపోయాయి. 2వ పట్టణ ఏఎస్సై నర్స న్న ఆందోళన చేస్తున్న నాయకులకు నచ్చజెప్పడంతో వారు విరమించారు. పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్‌ ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి హరీష్‌రావుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రేవెల్లి రాజలింగు, రాచర్ల సంతోష్‌, శనిగార పు శ్రావణ్‌, ఆకుల శంకర్‌, అడిచెర్ల రాంచందర్‌,  కాసర్ల యాదగిరి పాల్గొన్నారు.  


జన్నారం: బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్టుచేయడం అన్యా యమని గొల్లపెల్లి ప్రేమ్‌ సాగర్‌ అన్నారు. ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిం చి ప్రభుత్వ దిష్టిబ్మొను దహనం చేశారు. వంగపల్లి సురేష్‌ చందు, గాజుల దేవేందర్‌, నాగన్న, కొమురయ్య ఉన్నారు.

Updated Date - 2020-10-28T11:38:46+05:30 IST