బీజేపీ శ్రేణుల నిరసనలు

ABN , First Publish Date - 2022-01-28T06:12:32+05:30 IST

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయ డంతో బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. సిరి సిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

బీజేపీ శ్రేణుల నిరసనలు
సిరిసిల్లలో బీజేపీ నాయకుల నిరసన

సిరిసిల్ల రూరల్‌, జనవరి 27: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయ డంతో బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.  సిరి సిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  పార్టీ యువమోర్చా పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్‌ ఎంపీ ఆర్వింద్‌పై దాడి హేయనీయం అన్నారు. పార్లమెంట్‌ సభ్యు డిపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్యన్నారు. ఇలాంటి దాడులు మరోసారి జరిగితే టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యే లను అడ్డుకుంటామన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి వంగ అనిల్‌కుమార్‌గౌడ్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల సాయికృష్ణ, ఉపాధ్యక్షుడు రచ్చ రాహూల్‌, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాకూర్‌ రాజుసింగ్‌, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు శ్రీగాధ మైసయ్య, రాష్ట్ర నాయకులు బర్కం నవీన్‌యాదవ్‌, అదిపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, ఊరగొండ రాజు, చొప్పదండి అం జన్న, అత్మారాం, సుంకోజు రమేష్‌, కంచర్ల పర్శరాములు, చిలుక శ్రీకాంత్‌, గాజుల సదానందం పాల్గొన్నారు. 

గంభీరావుపేట: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై దాడిని ఖండిస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట గురువారం బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.  దాడికి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల  అధ్యక్షుడు గంట అశోక్‌, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మురళి, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పర్సాగౌడ్‌, కిసాన్‌మోర్చా జిల్లా కార్యదర్శి నల్ల రాజ్‌కుమార్‌, నాయకులు శ్రీనివాస్‌, రాజిరెడ్డి, విఘ్నేష్‌గౌడ్‌, నవీన్‌, స్వామి, రాజు, అరవింద్‌ ఉన్నారు. 

తంగళ్లపల్లి: ఎంపీ అర్వింద్‌పై దాడిని నిరసిస్తూ తంగళ్ల పల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గురువారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహన చేయగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకోని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దళిత మోర్చా మండల అధ్యక్షుడు సిరిసిల్ల వంశీ, బీజేవైఎం మండల అధ్యక్షడు కోల అంజనేయులు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాళీచరణ్‌, బీజేపీ, బీజేవైఎం నాయకులు గజభీంకార్‌ సంతోష్‌, చిందం నరేష్‌, హేమంత్‌, మంచికట్ల ప్రసాద్‌, ప్రకాష్‌, వేముల కిషన్‌, రెడ్డి పర్శరాం, శశికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 ఎల్లారెడ్డిపేట: నిజామాబాద్‌ ఎంపీ  అర్వింద్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గురువారం ఆందోళనకు దిగారు. మండల కేం ద్రంలోని కొత్త బస్టాండు నుంచి పాత బస్టాండు వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, దేవేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, స్వామి, రవి, సంజీవరెడ్డి, మహేశ్‌, శ్రీనివాస్‌, రాజు, సృజన్‌, కిరణ్‌, బాబు, దయాకర్‌, భాస్కర్‌, పర్శరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ టౌన్‌: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని బీజేపీ నాయకులు అన్నారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన దాడికి పట్టణంలోని రాజన్న ఆలయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల తరపు పోరాటం చేస్తున్న బీజేపీ నేతలపై దాడులు చేయడం హేయమైన చర్యన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు, రూరల్‌ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్‌, అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీఽనివాస్‌, సుదర్శన్‌యాదవ్‌, రామతీర్థపు కృష్ణవేణిహరీష్‌, గడ్డమీది లావణ్యశ్రీనివాస్‌, అన్నారం ఉ మాశ్రీనివాస్‌ ఉన్నారు. 

Updated Date - 2022-01-28T06:12:32+05:30 IST