Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 3 2021 @ 20:22PM

విపక్షాల హక్కులను కాలరాస్తున్న బీజేపీ: అధీర్ రంజన్

న్యూఢిల్లీ: విపక్ష నేతలు, ప్రజల హక్కులను బీజేపీ ఊడలాక్కుంటోందని ‌లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు విపక్ష పార్టీ ఎంపీలు జరుపుతున్న నిరసనల్లో ఆయన శుక్రవారంనాడు పాల్గొన్నారు.

''మహాత్మాగాంధీ భారతదేశానికే కాకుండా, యావత్ ప్రపంచానికి శాంతి, అహింస, ఐక్యత, సౌభ్రాతృత్వ సందేశాలను అందించారు. ఆయన పాదాల మందు నిరసనలు తెలిపే హక్కును కూడా బీజేపీ నిరాకరిస్తోంది. విపక్షాల హక్కులనే కాకుండా ప్రజల హక్కులను ఊడలాక్కుంటోంది'' అని అధీర్ రంజన్ ఆరోపించారు.

శీతాకాల వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి విపక్ష పార్టీలకు చెందిన 12 మంది రాజ్యసభ సభ్యులు తమపై పడిన సస్పెన్షన్ వేటుకు నిరసగా మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శనలు సాగిస్తున్నారు. వర్షాకాల సమావేశాల చివరిరోజున తీవ్ర గందరగోళం సృష్టించారన్న కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంత వరకూ వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, టీఎంసీ, శివసేన నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కో ఎంపీ ఉన్నారు.

Advertisement
Advertisement