రీచలో ఇసుక తరలింపును అడ్డుకున్న బీకే

ABN , First Publish Date - 2021-08-12T05:23:55+05:30 IST

రొద్దం పెన్నానదిలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ ఇసుక రీచను హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.

రీచలో ఇసుక తరలింపును అడ్డుకున్న బీకే
పెన్నానదిలో కాంట్రాక్టర్లతో వారిస్తున్న బీకే, టీడీపీ నాయకులు

రొద్దం, ఆగస్టు 11: రొద్దం పెన్నానదిలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ ఇసుక రీచను హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. బుధవారం రొద్దం పెన్నానదిలోని రుద్రపాదాశ్రమం వద్ద ఇసుక రీచవద్ద ఇసుక తరలించేందుకు ఎక్సాకవేటర్‌, ట్రిప్పర్లురాగా వాటిని బీకే నాయకులు అడ్డుకున్నారు. రొద్దం మండలం చాలా వెనుక బడిన ప్రాంతమని అక్రమంగా ఇసుక తరలిస్తే భూగర్బజలాలు ఎండిపోయి ప్రజలకు, సాగు, తాగునీటికి ఇబ్బంది అవుతుందని మండిపడ్డారు. ఇప్పటికే నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా అంతట ఇసుక దోపిడిచేసి చివరకు రొద్దం మండలానికి వస్తారా? అంటూ బీకే ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇసుక రీచల పేరుతో ఇసుకంతా అక్రమంగా బెంగళూరుకు తరలిపోతోందని బీకే విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇసుకను తరలిస్తే అడ్డుకుంటామని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, మాజీ సర్పంచ అశ్వత్థనారాయణ, మురళి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-12T05:23:55+05:30 IST