కనిగిరి మహిళకు బ్లాక్‌ ఫంగస్‌

ABN , First Publish Date - 2021-05-19T07:50:25+05:30 IST

పట్టణంలోని ఓ ప్రధానోపాధ్యాయుని భార్యకు బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

కనిగిరి మహిళకు బ్లాక్‌ ఫంగస్‌

హైదరాబాద్‌లో చికిత్స

కనిగిరి, మే 18 : పట్టణంలోని ఓ ప్రధానోపాధ్యాయుని భార్యకు బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే సదరు మహిళకు గత నెలలో కరోనా వైరస్‌ సోకింది. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. కరోనా చికిత్స కోసం వాడిన మందులు స్టేరాయిడ్ల ప్రభావంతో ఆమెకు గ్లూకోజ్‌ లెవల్స్‌ పెరిగాయి. దీంతో మదుమేహ వ్యాధికి దారి తీసింది. మూడు రోజుల క్రితం ఆమెకు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి సోకి అనారోగ్యానికి గురైంది. ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. శస్త్రచికిత్స చేసి కంటి, దవడ భాగాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి కనిగిరి ప్రాంతానికి ఒక మహిళకు సోకిందని తెలియడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-05-19T07:50:25+05:30 IST