నిపుణులు లేకుండా బ్లాస్టింగ్‌ చేయకూడదు

ABN , First Publish Date - 2021-05-18T05:12:58+05:30 IST

మండల పరిధిలోని గాలేరు-నగరి కాల్వ పనులతో పాటు ఐరన్‌ఓర్‌ ఇనుప గనుల్లో నిపుణులు లేకుండా జిలెటిన్‌స్టిక్స్‌తో బ్లాస్టింగ్‌ చేయకూడదని కడప డీఎస్పీ బి.సునీల్‌ పేర్కొన్నారు.

నిపుణులు లేకుండా బ్లాస్టింగ్‌ చేయకూడదు
బెనటా మైన్స్‌లో బ్లాస్టింగ్‌ జరిగే ప్రదే శాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ

కడప డీఎస్పీ బి.సునీల్‌


పెండ్లిమర్రి, మే 17: మండల పరిధిలోని గాలేరు-నగరి కాల్వ పనులతో పాటు ఐరన్‌ఓర్‌ ఇనుప గనుల్లో నిపుణులు లేకుండా జిలెటిన్‌స్టిక్స్‌తో బ్లాస్టింగ్‌ చేయకూడదని కడప డీఎస్పీ బి.సునీల్‌ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని బెనట, ఐరన్‌ఓర్‌ కంపెనీలతో పాటు చెర్లోపల్లె గ్రామ సమీపంలో జరుగుతున్న గాలేరు నగ రి, బీఎల్‌ఆర్‌ కాల్వ పనులను సోమవారం డీఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నిల్వ ఉంచిన డిటోనేటర్లను, జిలిటెన్‌ స్టిక్స్‌ను పరిశీలించారు. వాటికి సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు. బ్లాస్టింగ్‌ చేయాలంటే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించాలన్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బందికి సమాచారం అందించిన తరువాతనే బ్లాస్టింగ్‌ చేయాలన్నారు. అనంతరం పెండ్లి మర్రి పోలీసుస్టేషన్‌ చేరుకుని, ఎస్‌ఐ కొండారెడ్డిని కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2021-05-18T05:12:58+05:30 IST