రక్త‘నిల్‌’వలు

ABN , First Publish Date - 2021-06-14T06:21:06+05:30 IST

కరోనా మహమ్మారి రక్తం నిల్వలపై తీవ్ర ప్రభావం చూపింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడం, స్కూళ్లు, కళాశాలలు తెరుచుకోకపోవడం, రక్తదాతలపై కొవిడ్‌ పంజా విసరడం... ఈ కారణాలతో రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయి. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కథనం....

రక్త‘నిల్‌’వలు

  • కొవిడ్‌ సమయంలో రక్తం కొరత
  • 2021-22లో 5,769 యూనిట్ల సేకరణ
  • నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా... 

జీజీహెచ్‌ (కాకినాడ), జూన్‌ 13: కరోనా మహమ్మారి రక్తం నిల్వలపై తీవ్ర ప్రభావం చూపింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడం, స్కూళ్లు, కళాశాలలు తెరుచుకోకపోవడం, రక్తదాతలపై కొవిడ్‌ పంజా విసరడం... ఈ కారణాలతో రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు నిండుకున్నాయి. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కథనం....

కొవిడ్‌ వేళ  సాధారణ రోగులకు రక్తం అందుబాటులో లేకపోవడం పెను సమస్యగా మారింది. గర్భిణులకు ప్రసవ సమయంలో రక్తం అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంది. రక్తహీనత, ఆపద, సంక్లిష్ట, ప్రాణాంతక, క్షతగాత్రులకు సకాలంలో రక్తం అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొవిడ్‌ శస్త్ర చికిత్సలకు సైతం రక్తం అందుబబాటులో లేక బాధితులు ఇబ్బందిపడుతున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు వారంలో ఒకట్రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఇప్పడు వారికి కూడా రక్తం దొరకడం కష్టతరమవుతోంది.

జిల్లాలో ఏటా వైద్య, ఆరోగ్య శాఖ, రెడ్‌క్రాస్‌, పలు సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి వేల యూనిట్ల రక్తాన్ని  సేకరిస్తున్నారు. డిమాండ్‌కు తగిన రక్తం అందుబాటులో లేక ఎందరో నిరుపేదలు మృతి చెందుతున్నారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వారు రక్తదానం చేసేందుకు అర్హులు. అయితే కొవిడ్‌  మొదటి, రెండో వేవ్‌ల్లో పాజిటివ్‌ బారిన పడిన వారిలో అధికంగా ఈ వయసు వాళ్లే ఉండడంతో రక్తదానం చేయడంలో సమస్య తలెత్తింది. ఫలితంగా ఏటా 50 వేలకు పైగా యూనిట్ల రక్తం నిల్వలు ఉండే స్థితి నుంచి క్షీణస్థితికి చేరుకోవడం జిల్లా యంత్రాంగాన్ని కలవరపాటుకి గురి చేస్తోంది. జిల్లాలో రక్తనిధి కేంద్రాలు ప్రభుత్వానివి 6, ప్రైవేటువి 12 ఉన్నాయి. 

రక్తనిల్వల సేకరణ పరిస్థితి ఇదిగో.. 

సంవత్సరం (ఏప్రిల్‌ నుంచి మార్చి) - రక్తదాన శిబిరాలు- మొత్తం  యూనిట్లు 

2016-2017  339 56,120 

2017- 2018   373 60,077

2018-2019 397        63,904

2019- 2010 358 66,861

2020-2021 192 50,249

ఏప్రిల్‌ 2021 - మే -2022 -   21    5769 


Updated Date - 2021-06-14T06:21:06+05:30 IST