అనంతగిరి ఘాట్‌రోడ్డులో బొలేరో వాహనం బోల్తా

ABN , First Publish Date - 2021-12-08T05:38:54+05:30 IST

అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఒకటో నంబరు మలుపు వద్ద మంగళవారం సాయంత్రం బొలేరో వాహనం బోల్తాపడింది.

అనంతగిరి ఘాట్‌రోడ్డులో బొలేరో వాహనం బోల్తా
బోల్తాపడిన బొలేరో వాహనం

పలువురు పర్యాటకులకు గాయాలు



అనంతగిరి, డిసెంబరు 7: అనంతగిరి ఘాట్‌రోడ్డులో ఒకటో నంబరు మలుపు వద్ద మంగళవారం సాయంత్రం బొలేరో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు పర్యాటకులు గాయపడ్డారు. విజయనగరానికి చెందిన కొంతమంది మిత్రులు మంగళవారం ఉదయం బొలేరో వాహనంలో అరకులోయ సందర్శనకు వెళ్లారు. సాయంత్రం తిరిగి విజయనగరం వెళుతుండగా అనంతగిరి ఘాట్‌ ఒకటో నంబరు మలుపు వద్ద వాహనం అదుపుతప్పి, కొండను ఢీకొట్టి రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో వాసురెడ్డి, పైడిరాజు, అప్పలరాజు, వాసు, అనిల్‌, తదితరులు గాయపడ్డారు.


Updated Date - 2021-12-08T05:38:54+05:30 IST