బౌద్ధ దమ్మ పీఠం పీపీఈ కిట్ల వితరణ

ABN , First Publish Date - 2021-05-23T06:11:59+05:30 IST

కరోనా సమయంలో బాధితులను ఆదుకుంటున్న యువతకు ఉండ్రాజవరం గ్రామంలోని బౌద్ధ దమ్మపీఠం తనవంతు సహకారం అందించి ప్రజా మన్ననలు పొందుతోంది.

బౌద్ధ దమ్మ పీఠం పీపీఈ కిట్ల వితరణ
పీపీఈ కిట్లు పంపిణీ చేస్తున్న పీఠాధిపతి అనాలయో

ఉండ్రాజవరం, మే 22: కరోనా సమయంలో బాధితులను ఆదుకుంటున్న యువతకు ఉండ్రాజవరం గ్రామంలోని బౌద్ధ దమ్మపీఠం తనవంతు సహకారం అందించి ప్రజా మన్ననలు పొందుతోంది. శనివారం మండలం లోని పసలపూడి గ్రామానికి చెందిన యువర్‌ సర్వెంట్స్‌ (మీ సేవకులు) స్వచ్ఛంద సంస్థ ఫౌండర్‌ చీపుళ్ల విజయ్‌కు బౌద్ధ దమ్మ పీఠం అధిపతి అనాలయో పీపీఈ కిట్‌లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అనాలయో మాట్లాడుతూ యువత చేస్తున్న సేవలకు తన వంతు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. విజయ్‌ మాట్లాడుతూ కరోనాతో చనిపోయిన  వారిని దహన సంస్కారాలకు ఎవరూ తీసుకువెళ్లకపోతే తాము పీపీఈ  కిట్‌ వేసుకుని దహన సంస్కారాలు చేస్తున్నట్టు వివరించారు. కత్తుల సుధీంద్ర తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-23T06:11:59+05:30 IST