Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆయిల్‌పాం సాగుకు బాలారిష్టాలు

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 3వేల ఎకరాల లక్ష్యం

700 ఎకరాల్లోపే పంటసాగయ్యే పరిస్థితి

డ్రిప్‌ మంజూరు, నిధుల కేటాయింపునకు ఇబ్బందే

లక్ష్యం నెరవేరలేని పరిస్థితులు 


నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం వరిపంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌ పాంను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని చెప్పడంతోపాటు అందుకు అనుగుణం గా రైతులను కూడా సన్నద్ధం చేసింది. అయితే నిధుల కేటాయింపుతో పాటు డ్రిప్‌ మంజూరు కూడా ప్రధాన సమస్యగా మారింది. ప్రభుత్వం మొదట నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కేవలం 5 నుంచి 6 మండలాలు మాత్ర మే ఎంపిక చేయగా, ఆ తర్వాత రెండు జిల్లాల్లోని మొత్తం మండలాలకు పంటను విస్తరింపజేయాలని నిర్ణయించింది. అయి తే పంటసాగుకు కావాల్సిన మొక్కలు మొదలుకొని బిందు సేద్యం, రుణాల వంటివి సమస్యగా మారుతున్నా యి. రెండు జిల్లాల్లో కలిపి 3000 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగును చేయాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఈ పంట సాగుకు రాయితీలు, ప్రో త్సాహకాలను కేంద్రం నుంచి 60 శా తం, రాష్ట్రం నుంచి 40 శాతం నిధులను కలిపి ఉద్యానశాఖ విడుదల చేయాల్సి ఉంటుం ది. కానీ నిధుల కేటాయింపు లేకపోవడం గమనార్హం. ఈపంట సాగుకు డ్రిప్‌ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో డ్రిప్‌ ప్రక్రియ 10 నుంచి 20శాతం కూడా ఏర్పాటు చేయలేదు. అంటే పండ్లు, కూరగాయల సాగుకు డ్రిప్‌ను అరకొరగానే ఇస్తున్నారు.     


అటు ప్రభుత్వంతోపాటు ఇటు రెండు జిల్లాల అధికారులు ఆయిల్‌పాం సాగు విషయంలో తొలుత ఆర్భాటం చేశారు. ఆతర్వాత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కనిపించకపోవడంతో చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. ఆయిల్‌పాం సా గుకు ఎకరా తోటకు రూ.24వేలు ఖర్చవుతుండగా అందులో రూ.16వేలు రాయితీగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈరాయితీ లో 60శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. డ్రిప్‌ మంజూరు చేసినట్లయితే ఆపొలాలు, చేలను జీపీఎస్‌ సర్వే నెంబర్లతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆ సర్వే నెంబర్ల భూముల కు గతంలో డ్రిప్‌ మంజూరు చేసినట్లయితే తిరిగి ఇవ్వరు. దీంతో అధిక శాతం రైతులకు డ్రిప్‌ వచ్చే అవకాశాలులేవు. గతంలో పంటలకు భిన్నంగా ఆయిల్‌పాం సాగు చేయాలని ప్రభుత్వం చెబుతుంది తప్ప డ్రిప్‌ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్‌పాం సాగు కోసం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 54 మండలాలను ఎంపిక చేసినప్పటికీ ఆచరణలో మాత్రం ముందుకు సాగకపోవడం లేదు.సాగు చేస్తే మూడేళ్ల నుంచే పంట చేతికొస్తుందని, 35 ఏళ్లపాటు రైతులకు ఆద యం సమకూరుతుందని ప్రభు త్వం చేప్పినప్పటికి ఆస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. 


సరిపడా అందుబాటులోలేని మొక్కలు

అధికారుల లెక్కల ప్రకారం 3000 ఎకరాలకు లక్షా71వేల మొక్కలు అవసరం ఉంది. ఎకరాకు 57 మొక్కల చొప్పున పెంచాలని నిర్ణయించారు. అదనంగా మరో 50వేల మొక్కలను కూడా పెంచాలని నిర్ణయించినప్పటికీ ఆచరణ రూపుదాల్చలేదని సమాచారం. వాస్తవానికైతే నర్సరీలు అధికంగా ఉండాలి. ప్రస్తుతం కేతేపల్లి మండలం ఇనుపాముల నర్సరీలో మాత్ర మే మొక్కలను పెంచుతున్నారు. ఈ నర్సరీ లక్షా71వేల మొక్కల పెంపకానికి సరిపడా ఉన్నప్పటికీ మొక్కల పెంపకం మాత్రం పూర్తిస్థాయిలో జరగకపోవడం, ఆశించిన స్థాయిలో మొక్కలు ఎదగడంలేదని తెలుస్తోంది. ఇనుపాముల వద్ద 15 ఎకరాల స్థలంలో 10లక్షల మొక్కలను సైతం నర్సరీల్లో పెంచేందుకు ఏర్పా ట్లు చేసినా ఆచరణలో మాత్రం అందుకు అనుగుణంగా లేదని సమా చారం. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నేలల స్వభావానికి అనుగుణంగా ‘టెనోరా’ రకం మొక్కలను ఎంపికచేసి నర్సరీల్లో పెంచుతున్నారు. అయితే ప్రస్తుతం 39,900 మొక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికైతే ఏడాదిపాటు ఆ మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం మొక్కల ఎదుగుదల లేకపోవడంతో మొక్కల పంపిణీ కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరు వరకు మొక్కలను పంపిణీచేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అరకొర మొక్కలను పంపిణీ చేయడానికి అధికారులు యోచిస్తున్నారు. కొద్దిరోజుల్లో పెద్దవూర, నేరెడుచర్ల మండలాల్లో కూడా నర్సరీలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచా రం. ఇదిలా ఉంటే సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 3వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాల్సి ఉన్నప్పటికీ కేవలం 700ఎకరాలకు మించి ఆయిల్‌ పాం సాగు చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇవి కూడా అధికారుల కాకీలెక్కలా లేక వాస్తవమా అనేది కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. 


మూడేళ్లపాటు ప్రోత్సాహకం కూడా కష్టమే

ఉపాధి హామీ పథకానికి ఈ ఆయి ల్‌పాంను అనుసంధానం చేశారు. 2020-21, 2021-22 సంవత్సరాలకు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు ఆయిల్‌పాం మొక్కల పెంపకానికి మూడేళ్లపాటు ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి మూడేళ్లకు కలిపి కూలీ రూపం లో రూ.41,236, సామగ్రి కోసం రూ.15,047, మొత్తం రూ.56,2 83 ఇవ్వాలి. గరిష్ఠంగా 5 ఎకరాల వరకు ఈ సహకారం అందించనున్నారు. ఈ 5ఎకరాలకు మూడేళ్లలో కూలీల రూపంలో రూ.1,63,125, సామగ్రి రూపంలో రూ.57,858, మొత్తం రూ.2,20,983 రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్కో ఎకరానికి ఆయిల్‌పాం మొక్కలు 57కాగా గరిష్ఠంగా 5 ఎకరాలకు 285 మొక్కలను ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కలు నాటడానికి, గుంతలు తీయడానికి, మొక్కల ఖర్చు, రవాణా ఖర్చులను ఉచితంగా ఉపాధి హామీ పథకం ద్వారా అందజేయనున్నారు. వీటితోపాటు బతికి ఉన్న ప్రతీమొక్కకు నెలకు రూ.15చొప్పున మూడేళ్లపాటు మెయింటనెన్స్‌ ఇవ్వడంతోపాటు వర్మీ కంపోస్టు, నీమ్‌కేక్‌ వంటి సేంద్రీయ ఎరువుల కోసం సంవత్సరానికి మొక్కకు రూ.25చొప్పున ఇవ్వాలి. ఇదంతా భారంగా భావిస్తుండటంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో ఆయిల్‌పాం సాగుకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులకు ఖమ్మం జిల్లా అశ్వరావు పేటతోపాటు పలు ప్రాంతాల్లో శిక్షణ కూడా ఇచ్చారు. 


పలువురు అధికారుల నిరాసక్తత

ఆయిల్‌పాం సాగుపై ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శిక్షణా తరగతులకు తీసుకెళ్లిన అధికారులు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పూర్తిస్థాయి లో అమలు చేయలేకపోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి పెద్దగా స్పం దన లేకపోవడంవల్ల కొందరు హార్టికల్చర్‌ అధికారులు రైతులకు ముఖం చాటేస్తు న్నారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని విశ్వసనీయ సమాచారం. 6 నుంచి 7 మండలాల చొప్పున ఒక హార్టికల్చర్‌ అధికారి ఉన్నారు. వీరిలో కొందరు ఆయిల్‌ పాం సాగు, మొక్కల పంపిణీ విషయంతోపాటు డ్రిప్‌ మంజూరు చేయించలేక, రైతులకు సమాధానం చెప్పకోలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే మొ క్కల పంపిణీ కూడా పూర్తిస్థాయిలో లేకపోవడం, అరకొరగానే మొక్కలు ఉన్న నేపథ్యంతోపాటు డ్రిప్‌ కూడా సమస్యగా మారడంతో ఉద్యానవనశాఖ అధికారులకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జిల్లాలో ఆయిల్‌పాం సాగుపై ఉద్యానవ న శాఖ అధికారి సంగీతలక్ష్మీని వివరాల కోసం ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement
Advertisement