రొమ్ము కేన్సర్‌ ప్రాణాంతకం కాదు

ABN , First Publish Date - 2021-10-24T05:45:36+05:30 IST

రొమ్ము కేన్సర్‌ ప్రాణాంతకం కాదని, ఎంత ముం దుగా గుర్తిస్తే అంత సురక్షితంగా నయం చేసుకోవచ్చని జీఎస్‌ఎల్‌ ట్రస్ట్‌ కేన్సర్‌ ఆసుపత్రి సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ తరుణ గోగినేని అన్నారు.

రొమ్ము కేన్సర్‌ ప్రాణాంతకం కాదు

రాజానగరం, అక్టోబరు 23: రొమ్ము కేన్సర్‌ ప్రాణాంతకం కాదని, ఎంత ముం దుగా గుర్తిస్తే అంత సురక్షితంగా నయం చేసుకోవచ్చని జీఎస్‌ఎల్‌ ట్రస్ట్‌ కేన్సర్‌ ఆసుపత్రి సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ తరుణ గోగినేని అన్నారు. పింక్‌ అక్టోబర్‌ కార్యక్రమంలో భాగంగా జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో రొమ్ము కేన్సర్‌పై శని వారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రొమ్ముకు కేన్సర్‌ అంటే కుటుంబానికి కూడా చెప్పుకోలేని, చర్చిం చలేని స్థితి నుంచి స్త్రీలు బయటపడాలని, కుటుంబీకులు ఆమెకు సపోర్టుగా నిలబడాలన్నారు. రొమ్ము కేన్సర్‌ను చిన్నతనంగా, స్టిగ్మాగా భావించే పరిస్థితులు తొలగించేలా అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి అక్టోబరు నెలలో పింక్‌ అక్టోబర్‌గా గుర్తించారన్నారు. రొమ్ము కేన్సర్‌తో సహా అన్ని రకాల కేన్సర్‌లనూ నయం చేయడానికి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. జీఎస్‌ఎల్‌ కేన్సర్‌ ఆసుపత్రి దేశంలో ఏడో స్ధానంలో ఉందన్నారు. సద స్సులో డాక్టర్లు ఆనందరావు, రాజునాయుడు, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:45:36+05:30 IST