Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లి వేదికపైనే మొదలెట్టేశారు.. ఈ వధూవరుల వైరల్ వీడియో చూసి నెట్టింట ఫన్నీ కామెంట్స్..

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల మధ్య కీచులాటలు మామూలే.. కొన్ని సందర్భాల్లో ఇవి మాంచి కామెడీకి కారణమవుతుంటాయి. అసలు పెళ్లైన ఎన్నాళ్లకు సంసారంలో కీచులాటలు మొదలవుతాయనేది భార్యాభర్తల  కెమిస్ట్రీని బట్టి ఉంటుంది. ఈ అలకలు, గిల్లికజ్జాలు సాధారణంగా నాలుగు గోడలకే పరిమితమవుతాయి. ఎప్పుడో తప్ప బయటివారి దాకా రావు. కానీ ఓ జంట మాత్రం పెళ్లి వేడుక పూర్తవకమునుపే సంసారపు సరిగమలను ఆలపించింది.  ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఆ వివాహ వేడుకలో ఓ ఫోటో షూట్‌ జరిగింది. ఆ సమయంలో పెళ్లికొడుకేమో కూర్చీపై కూర్చోగా దాని పక్కనే నేలపై పెళ్లి కూతురు కూర్చుంది. ఈ క్రమంలో ఆమె తన పక్కనే ఉన్న అరటి పండ్లను తినేందుకు సిద్ధమైంది. అయితే..పెళ్లికొడుకు మాత్రం ఆమె తినబోతున్న ఓ అరటి పండును చట్టుక్కున చేతిలోంచి లాక్కుని దర్జాగా తినేశాడు. పెళ్లి కూరుతు మొదట ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మరో అరటి పండు తీసుకుని తినబోతుండగా దాన్నీ చేతులోంచి లాగేసుకున్నాడు. దీంతో..ఆమె భర్తవైపు తిరిగి కాస్తంత చిరాకు ప్రదర్శించింది. కానీ..పెళ్లికోడుకు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన మానాన తాను అరటిపండ్లు తినేస్తూ దర్జాగా ఫోజులిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఏంటీ.. పెళ్లి వేదికపైనే  మొదలెట్టేశారా..? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement