Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 15 2021 @ 15:00PM

కిమ్ జోంగ్ ఉన్‌కు బ్రిటిష్ రాణి మెసేజ్

న్యూఢిల్లీ : ఉత్తర కొరియా జాతీయ దినోత్సవాల సందర్భంగా ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 7న ఆమె ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ ద్వారా ఈ సందేశాన్ని పంపించినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ ధ్రువీకరించింది. ఉత్తర కొరియా మీడియా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 


ఉత్తర కొరియా 73వ వ్యవస్థాపక దినోత్సవాలు ఈ నెల 9న అంగరంగ వైభవంగా జరిగాయి. అంతకు రెండు రోజుల ముందే, అంటే సెప్టెంబరు 7న బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ నుంచి శుభాకాంక్షల సందేశం కిమ్ జోంగ్ ఉన్‌కు చేరిందని ఉత్తర కొరియా మీడియా తెలిపింది. 


‘‘ప్రజాస్వామిక ప్రజా గణతంత్ర కొరియా జాతీయ దినోత్సవాలను జరుపుకుంటున్నందువల్ల, నేను భవిష్యత్తు కోసం శుభాకాంక్షలను పంపిస్తున్నాను’’ అని బ్రిటిష్ రాణి సందేశం పంపించారు. అయితే ఈ సందేశాన్ని బ్రిటిష్ మీడియాకు పంపించలేదు. బకింగ్‌హామ్ ప్యాలెస్ సామాజిక మాధ్యమాల అకౌంట్లలో కూడా పెట్టలేదు. గతంలో కూడా క్వీన్ ఇదే విధంగా సందేశం పంపించినట్లు తెలుస్తోంది. ఆమె సందేశాన్ని బహిరంగంగా వెల్లడించడం ఇదే మొదటిసారి. విదేశీ నేతలకు సందేశాలను పంపించేటపుడు ఫారిన్ ఆఫీస్ సలహా మేరకు క్వీన్ వ్యవహరిస్తారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement