Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 11:58AM

యూపీ ఎన్నికలు: బీఎస్పీ తొలి జాబితా విడుదల

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేశారు ఆ పార్టీ సుప్రెమో మాయావతి. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తొలి జాబితాలో భాగంగా 53 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. మరో ఐదుగురు అభ్యర్థుల్ని ఈరోజు సాయంత్రానికల్లా ప్రకటిస్తామని ఆమె తేల్చి చెప్పారు. నిజానికి ఈరోజు సుమారు 100 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే మొదటి విడత ఎన్నికల అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఎన్నికల ఫలితాల అనంతరమే పొత్తును ఉపసంహరించుకున్నారు. కాగా ఏడు విడతల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10 న విడుదల కానున్నాయి.

Advertisement
Advertisement