బడ్జెట్ 2022 : మూడేళ్ళలో 100 కార్గో టెర్మినల్స్ : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2022-02-01T17:03:43+05:30 IST

రానున్న మూడేళ్ళలో 100 కార్గో టెర్మినల్స్‌ను

బడ్జెట్ 2022 : మూడేళ్ళలో 100 కార్గో టెర్మినల్స్ : నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : రానున్న మూడేళ్ళలో 100 కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆతిథ్య రంగం పునరుజ్జీవం కోసం కృషి చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో అదనంగా రూ.2 లక్షల కోట్ల క్రెడిట్ సదుపాయం కల్పిస్తామన్నారు. 


స్టార్టప్ కంపెనీలను ‘డ్రోన్ శక్తి’ ద్వారా ప్రోత్సహిస్తామని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీకి ఈ బడ్జెట్‌లో గట్టి ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యా రంగానికి ప్రోత్సాహంలో భాగంగా 200 టీవీ చానళ్ళకు ఈ-విద్యను విస్తరిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు ఈ-కంటెంట్ డెలివరీని ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థుల కోసం డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌, నేషనల్ టెలీ హెల్త్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలతో నూతన తరం అంగన్వాడీల ఏర్పాటు చేస్తామని, 2 లక్షల అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. 


2023 నాటికి పీఎం ఆవాస్ యోజన క్రింద బలహీన వర్గాలకు చెందిన 80 లక్షల మందికి గృహాలను నిర్మిస్తామని చెప్పారు. 


ఈశాన్య రాష్ట్రాల కోసం కొత్తగా పీఎం గతిశక్తి పథకం క్రింద ఓ పథకాన్ని ప్రకటించారు. 


Updated Date - 2022-02-01T17:03:43+05:30 IST