బడ్జెట్ 2022 : 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాదే

ABN , First Publish Date - 2022-02-01T17:26:05+05:30 IST

5G స్పెక్ట్రమ్‌కు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు

బడ్జెట్ 2022 : 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాదే

న్యూఢిల్లీ : 5G స్పెక్ట్రమ్‌కు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం లోక్‌సభకు  చెప్పారు. 5G స్పెక్ట్రమ్‌ వేలం ఈ ఏడాది ప్రారంభమవుతుందన్నారు. 2025నాటికి దేశంలోని అన్ని గ్రామాకూ ఆప్టికల్ ఫైబర్ విస్తరిస్తుందన్నారు. 


రక్షణ రంగానికి అవసరమైనవాటిలో 68 శాతం వరకు దేశీయ మార్కెట్ల నుంచే సేకరిస్తామని చెప్పారు. ఎండ్-టు-ఎండ్ ఈ-బిల్ ద్వారా పారదర్శకతను తీసుకొస్తామని చెప్పారు. తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానంపై బడ్జెట్‌లో దృష్టిసారించినట్లు తెలిపారు. 2030నాటికి 280 గిగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సోలార్ ఎనర్జీలో హై ఎఫిషియెన్సీ మాడ్యూల్స్‌కు  ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ రూ.19,500 కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. 


Updated Date - 2022-02-01T17:26:05+05:30 IST