Advertisement
Advertisement
Abn logo
Advertisement

బస్సు, డీసీఎం ఢీ : ప్రయాణికుడికి గాయాలు

నల్లగొండ క్రైం, డిసెంబరు 3: నల్లగొండ పట్టణ పరిధిలోని మర్రిగూడ బైపాస్‌ వద్ద బస్సును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి. నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సమయంలో మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి రాత్రి 10.45 సమయంలో నల్లగొండ పట్టణంలోకి వస్తుంది. ఆ సమయంలో మర్రిగూడ బైపాస్‌ వద్ద హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న డీసీఎం ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న చిలుకూరి రాజు అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాత్రి సమయం కావడంతో బస్సులో ప్రయాణికులు తక్కువగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. బస్సును ఢీకొట్టిన అనంతరం డీసీఎం బోల్తా పడింది. బస్సు డ్రైవర్‌ శ్రీనివా్‌సరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
Advertisement