ఆయన స్వీడన్‌ ‘బిచ్చగాడు’!

ABN , First Publish Date - 2020-02-22T11:29:55+05:30 IST

బిచ్చగాడు సినిమాలో హీరో కోటీశ్వరుడు. కానీ తన తల్లిని కాపాడుకోవడం కోసం బిచ్చమెత్తుతాడు. అదే విధంగా స్వీడన్‌కు చెందిన ఓ ....

ఆయన స్వీడన్‌ ‘బిచ్చగాడు’!

 మనశ్శాంతి కోసం బిచ్చగాడిగా మారిన స్వీడన్‌ వ్యాపారవేత్త

 కోయంబత్తూర్‌ రైల్వే స్టేషన్‌లో రోజూ అడుక్కుంటున్న వైనం

కోయంబత్తూర్‌, ఫిబ్రవరి 21: బిచ్చగాడు సినిమాలో హీరో కోటీశ్వరుడు. కానీ తన తల్లిని కాపాడుకోవడం కోసం బిచ్చమెత్తుతాడు. అదే విధంగా స్వీడన్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త తన మనశ్శాంతి కోసం కోయంబత్తూరులో బిచ్చమెత్తుతున్నారు. ఆయన పేరు కిమ్‌. ధ్యానం కోసం మూడు నెలల వీసా మీద ఇండియాకు వచ్చారు. ఈశా యోగా కేంద్రాన్ని సందర్శించారు. మనశ్శాంతి లభించాలంటే బిచ్చమెత్తాలని ఓ గురువు చెప్పారు. దీంతో కిమ్‌ బిచ్చగాడి అవతారమెత్తారు. కోయంబత్తూరులోని రైల్వే స్టేషన్‌లో రోజూ అడుక్కుంటున్నారు. ఆయన రైల్వే స్టేషన్‌లో ఎవరితోనూ మాట్లాడరు. తనకు దానం చేసిన వారికి చిరునవ్వుతో దండం పెడతారు. తన వీసా ముగిసిన అనంతరం ఆయన తిరిగి స్వీడన్‌కు వెళ్లనున్నారు.

Updated Date - 2020-02-22T11:29:55+05:30 IST