గ్రామాల్లో ముమ్మరంగా ఇంటింటి ఆరోగ్య సర్వే

ABN , First Publish Date - 2021-05-08T05:57:19+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజారోగ్యంపై సర్వే చేపట్టారు.

గ్రామాల్లో ముమ్మరంగా ఇంటింటి ఆరోగ్య సర్వే
నారాయణరావుపేటలో ఆరోగ్య సర్వే

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజారోగ్యంపై సర్వే చేపట్టారు. ఆయా కేంద్రాల పరిధిలోని వైద్య ఆరోగ్య సిబ్బంది శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను    తెలుసుకుంటూ, తగిన అవగాహన కల్పించారు. 

 

సిద్దిపేట రూరల్‌, మే 7: ప్రతి వెయ్యి మందికి ఒక బృందం సర్వే చేస్తున్నారని పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అజిమోద్దీన్‌ తెలిపారు. శుక్రవారం పీహెచ్‌సీ పరిధిలోని ఉప కేంద్రాల ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే చేసినట్లు చెప్పారు. కరోన లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తారని చెప్పారు.  ప్రతీ ఇంటిని వైద్య బృందం సందర్శించి కరోనా సమస్యను క్షేత్రస్థాయిలో నివారించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.


ఇంటి వద్దే వైద్యం

నారాయణరావుపేట: మండలంలోని ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది శుక్రవారం ఇంటింటికీ తిరిగి ఆరోగ్య సర్వే చేపట్టారు.  నారాయణరావుపేట పీహెచ్‌సీ డాక్టర్‌ మోహన్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వచ్చి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని వారికి ఇంట్లోనే వైద్యం పొందేలా వారికి మందులను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో  హెచ్‌ఈవో జనార్దన్‌ రెడ్డి, సూపర్‌వైజర్లు సునీత, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు  పాల్గొన్నారు.


ప్రజలకు కరోనాపై అవగాహన

 నంగునూరు: మండలంలోని ఖాతా, నంగునూరు, నర్మెట, సిద్దన్నపేట బద్దిపడగ, ఖానాపూర్‌ తదితర గ్రామాల్లో  వైద్య ఆరోగ్యసిబ్బంది, పంచాయతీ రాజ్‌ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటా ప్రజారోగ్య సర్వే చేపట్టారు. ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, అంగన్‌వాడి, ఆశా కార్యకర్తలతో కూడిన బృందాలు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వేలు చేశారు. స్వల్ప జ్వరం లక్షణాలు ఉన్నవారి వివరాలను నమోదు చేసుకున్నారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని  ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్టులు చేసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ బెదురు తిరుపతి, నంగునూరు సహకార సంఘం చైర్మన్‌ కోల రమేష్‌ గౌడ్‌, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది,  ఏఎన్‌ఎంలు,  సిబ్బంది పాల్గొన్నారు.


చిన్నకోడూరు మండలంలో

చిన్నకోడూరు: మండలంలోని పెద్దకోడూరులో సర్పంచ్‌ బట్టు లింగం ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరగుతూ ఆరోగ్య సర్వేను ప్రారంభించారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ సాయి, పంచాయతీ కార్యదర్శి రాజు, ఏఎన్‌ఏం తిరుమల, ఆశావర్కర్లు పాల్గొన్నారు.


అవసరమైనవారికి ఉచితంగా చికిత్స 

చేర్యాల: వైద్య, ఐసీడీఎస్‌, పంచాయతీరాజ్‌శాఖ సిబ్బంది శుక్రవారం చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో ఇంటింటి ఆరోగ్య సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి జలుబు, జ్వరాలు తదితర వివరాలను  అడిగి , నమోదు చేసుకున్నారు. అవసరమైనవారికి ఉచితంగా మందులు, చికిత్సలు అందజేస్తామని అధికారులు తెలిపారు. చేర్యాల మండలం నాగపురి, పెద్దరాజుపేట, కడవేరుగు గ్రామాలల్లో నిర్వహించిన సర్వేను ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌ పర్యవేక్షించారు. అలాగే కొమురవెల్లి మండలం మర్రిముచ్ఛాల, కొమురవెల్లి గ్రామాల్లో నిర్వహించిన సర్వే ను ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిలివేరి సిద్దప్ప, సర్పంచు బొడ్గం పద్మ, ఎంపీడీవో అనూరాధ, తదితరులు పరిశీలించి పలు సూచనలు చేశారు. 


దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో

 దుబ్బాక/మిరుదొడ్డి:  దుబ్బాక మున్సిపాలిటీతోపాటు మండలంలోని పెద్దగుండవెళ్లి, పోతారం,చౌదర్‌పల్లి, పెద్దచీకోడ్‌ గ్రామాలతోపాటు వివిధ గ్రామాల్లో ఇంటింటి సర్వేను నిర్వహించారు. అలాగే మిరుదొడ్డి  వీరారెడ్డిపల్లి, మోతే, మిరుదొడ్డి గ్రామాల్లో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు..  కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు,  సర్పంచులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఎంపీటీసీ బాలమల్లేశం, నాయకులు  తదితరులున్నారు. 


రాయపోల్‌లో 32, దౌల్తాబాద్‌లో 42 బృందాలు

రాయపోల్‌:  రాయపోల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లోని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా రాయపోల్‌ మండలంలో 32, దౌల్తాబాద్‌ మండలంలో 42 బృందాలు సర్వే చేస్తూ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అవసరమైన మందులను అందజేశారు. ఎంపీడీవోలు మచ్చేందర్‌, రాంరెడ్డి, డాక్టర్లు, సిబ్బందికి తగు సూచనలు అందజేశారు.


500 జనాభాకు ఒక బృందం  

గజ్వేల్‌: ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కుర్లు, బృందాలుగా ఏర్పడి గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌తో పాటు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించారు. అనారోగ్యం లక్షణాలను నమోదు చేసుకున్నా రు. ఒక్కో బృందం 500 జనాభా గల పరిధిలో పనిచేస్తున్నదన్నారు.గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ లోని 18వ వార్డుతో పాటు అన్ని వార్డుల్లో సర్వే చేపట్టారు. 


జగదేవ్‌పూర్‌ మండలంలో

జగదేవ్‌పూర్‌:  మండలంలోని మునిగడప, జగదేవ్‌పూర్‌, మాందాపూర్‌, అనంతసాగర్‌, ఇటిక్యాల, బీజీవెంకటాపూర్‌ గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు.


ఎర్రవల్లిలో 5 గ్రూపులుగా సర్వే 

మర్కుక్‌: మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో సర్పంచ్‌ భాగ్య భిక్షపతి అధ్వర్యంలో ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించారు. అంగన్‌డీ టీచర్‌, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌, కార్యదర్శి మరియు ఇతరులు మొత్తం ఐదు గ్రూపులుగా ఏర్పడి సర్వే చేస్తున్నట్టు తెలిపారు.  ఇంటికి వచ్చిన 


వర్గల్‌ మండలంలో

వర్గల్‌: మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రతీ ఇంటి నుంచి ఆరోగ్య వివరాలను సేకరించారు. అవసరమున్న వారికి మందులు పంపిణీ చేశారు. 


కొండపాక మండలంలో 

కొండపాక : మండలంలోని వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు. వైద్య సిబ్బంది శుక్రవారం ఇంటింటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను సమాచారం సేకరించారు.  జ్వరం ఇతర లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరించి అవసరమైన మందులు ఇస్తున్నారు.


అక్కన్నపేట మండలంలో

అక్కన్నపేట: శుక్రవారం అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలో  వైద్య సిబ్బంది కరోనాపై ఇంటింటి సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మార్క తిరుపతిగౌడ్‌,  పంచాయతీ కార్యదర్శి గుగులోతు తిరుపతి, ఏఎన్‌ఎం ఎజాజ్‌ పాషా,ఆశ కార్యకర్త లక్ష్మి, అంగన్‌వాడి టీచర్‌ శోభ  ఉన్నారు.


కరోనా ఉంటే కిట్లను అందజేయాలి

 కోహెడ: ఇంటింటి ఆరోగ్య సర్వేలో కోవిడ్‌ లక్షణాలు కనిపించిన వారికి వెంటనే కిట్ల అందజేయాలని ఎంపీపీ కీర్తి సూచించారు. శుక్రవారం కోహెడ, వింజపల్లి,  తంగళ్లపల్లి గ్రామాల్లో ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించారు. వ అలాగే కోహెడలో ఇంటింటి సర్వే తీరును సర్పంచ్‌ నవ్య, ఎంపీటీసీ స్వరూప, సింగిల్‌ విండో చైర్మన్‌ దేవేందర్‌రావు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌, వైద్యాధికారి విజయరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆశావర్కర్లు, అంగన్‌ వాడీ టీచర్లు పాల్గొన్నారు.


మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో..

మద్దూరు: ప్రజారోగ్యానికి సంబంధించి దూళిమిట్ట, మద్దూరు మండలాల్లో నిర్వహించిన సర్వేలో  దూళిమిట్ట, వంగపల్లి గ్రామాల సర్పంచులు దుబ్బుడు దీపిక, గంగి భాగ్యలక్ష్మీ, ఏఎన్‌ఎం స్వరూప, రేణుక, ఆశా కార్యకర్త ప్రమీల, అంగన్‌వాడీ టీచర్లు  పాల్గొన్నారు.

 

Updated Date - 2021-05-08T05:57:19+05:30 IST