Abn logo
Nov 27 2020 @ 23:22PM

గిట్టుబాటు ధరతో అటవీ ఫలసాయాలు కొనుగోలు

గుమ్మలక్ష్మీపురం: గిట్టుబాటు ధరతో గిరిజనులు సేకరించే అటవీ ఫల సాయాలను కొనుగోలు చేయాలని పార్వతీపురం జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ శ్రీరామ్మూర్తి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన గుమ్మలక్ష్మీపురం జీసీసీ బ్రాంచ్‌ పరిధిలోని ఉద్యోగులతో సమా వేశం నిర్వహించారు. ఈ ఏడాది గిరిజనులు సేకరించే చింతపండు, కరక్కాయలు, నరమామిడి బెరడు, కొండ తామర జిగురు, నల్ల జీడి పిక్కలు, కాగు, ముసిరిక పిక్కలు, తదితర ధరలను పెంచుతున్నట్లు  తెలిపారు. జీసీసీ డీఆర్‌ డిపోల ద్వారా సీసీపీఏలు గిరిజన సంతల్లో కూడా అటవీ ఫలసాయాలను కొనుగోలు చేయాలని సూచించారు.  నిత్యావసర సరుకుల అమ్మకాలు కూడా పెంచాలన్నారు. కింద నుంచి పైస్థాయి వరకు ఉద్యోగులందరూ కష్టపడి పని చేయాలన్నారు. గుమ్మలక్ష్మీపురం జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ బి.కృష్ణ, అకౌంటెంట్‌ ఎస్‌.రాము, సీసీపీఏలు, గోదాం సూపరింటెండెంట్లు, సెల్స్‌మెన్లు పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement
Advertisement