ప్రశాంతంగా నీట్‌

ABN , First Publish Date - 2022-07-18T05:44:52+05:30 IST

ఎంబీబీఎస్‌, డెంటల్‌ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెన్స టెస్టు (నీట్‌-2022) ఆఫ్‌లైన ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది.

ప్రశాంతంగా నీట్‌
పరీక్ష కేంద్రం వద్ద అభ్యర్థులు

  1. రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు
  2. 5,350 మంది అభ్యర్థులు హాజరు 

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 17: ఎంబీబీఎస్‌, డెంటల్‌  కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెన్స టెస్టు (నీట్‌-2022) ఆఫ్‌లైన ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎనటీయే) ఆధ్వర్యంలో నీట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు కొనసాగింది. గతంలో పరీక్ష సమయం 3 గంటలు ఉండగా.. ఈసారి అదనంగా 20 నిమిషాలు కేటాయించారు. కర్నూలు నగరంలో మొత్తం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,556 మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 5350 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 206 మంది గైర్హాజరయ్యారు. నీట్‌ ప్రవేశ పరీక్ష ఆఫ్‌లైన విధానంలోనే జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకే అభ్యర్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో అభ్యర్థులు, వారి బంధువులతో రద్దీ ఏర్పడింది. మధ్యాహ్నం 1.30 గంటలకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. మెయినగేటు ముందరనే అభ్యర్థులను తనిఖీలు చేసి లోపలికి పంపారు. ముఖ్యంగా మహిళ అభ్యర్థుల గోల్డ్‌ చైనలు, ముక్కుపుడకలు, రింగ్‌ వాచలను బయటనే తొలగించి పరీక్ష కేంద్రంలోనికి పంపించారు. 


Updated Date - 2022-07-18T05:44:52+05:30 IST