దోపిడీకి అడ్డుకట్ట పడేనా?

ABN , First Publish Date - 2021-02-22T04:30:45+05:30 IST

జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి జ్వరం వచ్చిన, దగ్గు, జలుబు చేసి రోగాల బారిన పడితే చాలు శంకర్‌దాదాలకు కాసుల పంట పండినట్టే ప్రజల అనారోగ్యంను వారి ధనార్జ నకు వాడుకుంటూ తమకు కమీషన్లు ఇచ్చే ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నా రు.

దోపిడీకి అడ్డుకట్ట పడేనా?

ట్రెండ్‌ మార్చిన పలువురు ఆర్‌ఎంపీ, పీఎంపీలు, మెడికల్‌ రిప్‌లు
అరువుకు వైద్యులను తెస్తూ వారికి టార్గెట్స్‌
అనుమతులు లేకున్నా ఆసుపత్రుల ఏర్పాటు
 జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆసుపత్రులు

కామారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 21: జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి జ్వరం వచ్చిన, దగ్గు, జలుబు చేసి రోగాల బారిన పడితే చాలు శంకర్‌దాదాలకు కాసుల పంట పండినట్టే ప్రజల అనారోగ్యంను వారి ధనార్జ నకు వాడుకుంటూ తమకు కమీషన్లు ఇచ్చే ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నా రు. ఇలా వచ్చిన వారిని పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులు అవసరంలే కున్నా పరీక్షలు చేయిస్తూ దోపిడీ పర్వానికి తెరలేపుతున్నా నియంత్రించాల్సిన వైద్యఆరోగ్యశాఖ అఽఽధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. పదో తరగతి కూడా పాసుకాని వారు సైతం నాలుగు రోజు లు కంపౌండర్‌గా ఏదైన ప్రైవేట్‌ ఆసుపత్రులలో పనిచేస్తే చాలు ఆర్‌ఎంపీగా, పీఎంపీల మంటూ బోర్డులను ఏర్పాటు చేసుకుని ప్రాథమిక చికిత్సకు బదు లు సూదులు, మందుగోళిలు, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లను సైతం తీయిస్తున్నా రంటే ఏ స్థాయిలో వైద్యఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వైద్యఆరోగ్యశాఖ అధికారుల అలసత్వం మూలంగా తమను ఎవరు ఏమి చేస్తారులే అనేధోరణిని ప్రదర్శిస్తూ ఒకరిని చూసి మరొక్కరు ట్రెండ్‌ మారుస్తు మెడికల్‌ రిప్‌లు, ఆర్‌ఎంపీ, పీఎంపీలు అంతా కలిసి అరు వుకు వైద్యులను తెస్తూ వారికి టార్గెట్స్‌ ఇచ్చి ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఈ తతంగం అంతా పెద్దఎత్తున జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖలో ముడుపులు తీసుకుంటున్న కొందరు అధికారులు, సిబ్బంది ఆ ఆసుపత్రుల వైపు కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన చాలావరకు ఆసుపత్రులకు అసలు వైద్యఆ రోగ్యశాఖ అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ఆసుపత్రులను కొనసాగిస్తున్నా రు. వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిన చూసీ చూడనట్లు వ్యవహరించడం పత్రిక కథనాలపై కలెక్టర్‌ ప్రశ్నించిన ప్రతీసారి దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ తమ అసమర్థతను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తు న్నారని సొంతశాఖలోని సిబ్బంది మాట్లాడుకోవడం గమనార్హం.
ట్రెండ్‌ మార్చిన ఆర్‌ఎంపీ, పీఎంపీ, మెడికల్‌ రిప్‌లు
గతంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పలుచోట్ల వైద్యఆరోగ్యశాఖ అధికారు ల కళ్లుగప్పి గుట్టుగా హైడోస్‌లతో సూది మందులు ఇస్తూ త్వరగా వ్యాధి నయం చేస్తూ వచ్చిన పలువురు ఆర్‌ఎంపీ, పీఎంపీ, మెడికల్‌ రిప్‌లు ప్రస్తు తం ట్రెండ్‌ మార్చారు. పదో తరగతి పాసుకాకున్నా ఏదైన మెడికల్‌షాపులో ఒక సంవత్సరం పాటు సహాయకునిగా పనిచేసి ఫేక్‌ డిగ్రీ పట్టాతో మెడికల్‌ రిప్‌లుగా మరో సంవత్సరం పనిచేసి తమకు ఉన్న పరిచయాలతో ఏకంగా అరువు డాక్టర్లను తీసుకువచ్చి ఆసుపత్రులనే ఏర్పాటు చేస్తూ వారికి టార్గె ట్‌లు ఇచ్చి ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. తమ వద్ద ఉండే శాంపిల్‌ మందులను సైతం అధిక ధరలకు ప్రజలకు అంటగడుతున్నారని సమాచా రం. జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ లాంటి ప్రాంతాలలో సమూహంగా ఏర్పడి అరువు వైద్యుల సర్టిఫికెట్‌తో వైద్యఆరోగ్యశాఖలో అను మతులకు ఆప్లికేషన్‌ పెట్టి అనుమతులు రాకముందే వారం రోజుల్లోనే ఆసు పత్రులను ఏర్పాటు చేసి ఆర్‌ఎంపీ, పీఎంపీలకు కమీషన్లు ఇస్తూ రోగులను వారి ఆసుపత్రులకు వచ్చేలా చూస్తున్నారని తెలుస్తోంది. వారు పనిచేసే కంపెనీల ద్వారా వచ్చే శాంపిల్‌ మందులను గతంలో వైద్యులకు చూయించి వారు ఒకే అంటే మాత్రమే మెడికల్‌ షాపులో ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. అరువు డాక్టర్లతో ఓ ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ పేరుతో శాంపిల్‌ మందులను అందించడం అక్కడ కూడా కక్కుర్తి పడి వైద్యులతో మరో రెండు మందులను అదనంగా రాయాలని చెబుతూ ఉచిత అవగాహన సదస్సుకు అయిన ప్రచార ఖర్చును సైతం రోగుల నుంచే లాగుతున్నారు.
అనుమతులు లేకున్నా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆసుపత్రులు
జిల్లా కేంద్రంలోని గోదాం రోడు, సిరిసిల్లా రోడ్డులలో ఏర్పాటు చేసిన పలు ఆసుపత్రులు ఆర్‌ఎంపీ, పీఎంపీ, మెడికల్‌ రిప్‌ల ద్వారా ఏర్పాటు చేసినవేననే విషయం బహిరంగ రహస్యం. అరువుకు తెచ్చిన వైద్యులకు టార్గెట్‌లు ఇస్తూ అవసరం లేకున్నా పరీక్షలు చేయించడం, జనరిక్‌ మందులను అధిక రేట్లకు అంటగడుతూ దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నలుగురు కలిసి ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రాంతంలో రోగాల బారిన పడిన వారి ఇంటింటికీ వెళ్లి కొద్దిరోజుల పాటు చికిత్సలు అందించడం హైడోస్‌ల వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌లతో రోజుల తరబడి మంచానపడేలా చేస్తూ వారిని వారు నెలకొల్పిన ఆసుపత్రులకు పంపిస్తూ కేవలం ఓపీ ఫీజులను మాత్రమే తక్కువగా తీసుకుంటూ స్కానింగ్‌, ఎక్స్‌రేలు, ఈఈజీలు, ఈసీజీలు అంటూ అవసరం లేకున్నా పరీక్షలు చేయిస్తూ కమీషన్ల రూపంలో దోపిడీ పర్వానికి తెరలేపుతున్నారని పలువురు ప్రైవేట్‌ వైద్యులు పేర్కొంటున్నారు.  జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్‌ కేంద్రాలు, ల్యాబ్‌లను ఎప్పటి కప్పుడు తనిఖీలు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కలెక్టర్‌ పత్రిక కఽథనా లకు స్పందించి వైద్యఆరోగ్యశాఖ అధికారులను ప్రశ్నించిన ప్రతిసారి దాటవేతధోరణి ప్రదర్శిస్తూ రెండు, మూడు ఆసుపత్రులలో తనిఖీలు చేయించి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఫొటోలు తీసుకుంటూ అప్పటిమందం గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అసలు ఆసుపత్రులకు వైద్యఆరోగ్యశాఖలో గత రెండు, మూడు సంవత్సరాలలో అనుమతులు ఇచ్చిన వి పదుల సంఖ్యలోనే ఉండగా జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వందల సంఖ్యలోనే ఆసుపత్రులు నెలకొల్పడం గమనార్హం. ఇప్పటికైనా కలెక్టర్‌ దృష్టి సారించి వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది తీరుపై, ఆర్‌ఎంపీ, పీఎంపీ, మెడికల్‌ రిప్‌ల వ్యవహారంతో పాటు ప్రజల జేబులను గుల్లచేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టిసారిసేన్తే ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆసుపత్రుల ఏర్పాటులో ఇష్టారీతిన వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి
ఆసుపత్రుల ఏర్పాట్లలో ఇష్టారీతిన వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకు ంటాం. ఆసుపత్రి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారో వారే ఆసుపత్రి నడపాలి. వైద్యుడు మారిన ఆయన స్థానంలో వేరే ఎవరైన వచ్చినా జిల్లా వైద్యఆరోగ్యశాఖకు సమాచారం అందించాలి. అనుమతులు లేకుండా ఆసుపత్రులను కొనసాగిస్తే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-02-22T04:30:45+05:30 IST