పంట కాలువలు, డ్రెయిన్లు కలుషితం

ABN , First Publish Date - 2021-12-07T04:59:58+05:30 IST

పశ్చిమ డెల్టా పంట కాలువల్లో, డ్రెయిన్లలో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది.

పంట కాలువలు, డ్రెయిన్లు కలుషితం
నివేదికను అందిస్తున్న కళాశాల సెక్రటరీ

భీమవరం, డిసెంబరు 6: పశ్చిమ డెల్టా పంట కాలువల్లో, డ్రెయిన్లలో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వెట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఇండో, యూరోపియన్‌ ప్రాజెక్టు పరిశోధనల్లో వెల్లడి కావడంతో కాలుష్యంపై నిపుణులు హెచ్చరించారు. ఇండో యూరోపియన్‌ ప్రాజెక్టు స్ర్పింగ్‌ ప్రాజెక్టులో భాగంగా ఏడాదిన్నర నుంచి పీఏ.రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలలో కాలుష్యం ప్రభావంపై సమగ్ర పరిశోధన చేసి ప్రత్యేక మ్యాప్‌లను రూపొందించారు. యూరోపియన్‌ యూనియన్‌కు పంపించుతున్న నివేదికను కళాశాల సెక్రటరీ ఎస్‌వి రంగరాజు, సీఈవో ఎస్‌ఆర్‌కే నిశాంతవర్మ, ప్రిన్సిపాల్‌ ఎం.జగపతిరాజు వెట్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ పీపీ.రామకృష్ణంరాజుకు సోమవారం అందించారు. కళాశాల వెట్‌ సెంటర్‌లో రైతుల నిపుణులు, అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సదస్సులో పాకా సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు బి.బలరాం, డ్రెయినేజీ ఈఈ పి.నాగార్జునరావు, ఇరిగేషన్‌ డీఈ ఎ.వేంకటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో వెట్‌ సెంటర్‌ నిపుణులు ఎన్‌.శివకిషన్‌, డా.రాంబాబు, వాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T04:59:58+05:30 IST