ప్రేరణ పేలవం

ABN , First Publish Date - 2021-10-11T06:33:28+05:30 IST

విద్యార్థుల్లో ని ద్రాణం గా ఉన్న సృజనను వెలికితీయటానికి పురుడు పోసుకున్న ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రక్రియ ప్రస్తుతం ప్రేరణ లేక పేలవంగా మారింది.

ప్రేరణ పేలవం
జిల్లా సైన్స్‌ సెంటర్‌

కానరాని ఇన్‌స్పైర్‌..!

ప్రేరణ పేలవం

ఏడాదికేడాదికీ తగ్గుతున్న ఇన్‌స్పైర్‌ అవార్డులు 

నామినేషన్లు వేయడంలో లోపిస్తున్న అవగాహన  

తగ్గుతున్న రాష్ట్ర స్థాయి అవార్డులు   

గతంలో ఘనంగా ‘ఇన్‌స్పైర్‌’ ఎగ్జిబిషన్‌

 మసకబారుతున్న అవార్డుల తంతు

15వ తేదీ నామినేషన్లకు ఆఖరి గడువు 

అధికారులు నిర్లక్ష్యం వల్లే అవార్డుల్లో నిర్లిప్తత?

అనంతపురం విద్య, అక్టోబరు 10: విద్యార్థుల్లో ని ద్రాణం గా ఉన్న సృజనను వెలికితీయటానికి పురుడు పోసుకున్న ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రక్రియ ప్రస్తుతం ప్రేరణ లేక పేలవంగా మారింది. ఇన్‌స్పైర్‌ అవార్డుల మంజూరు, రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికైన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత మూడేళ్లుగా ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రక్రియ వేడుకను అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించడం ఒక కారణమైతే, కరోనా మరో కారణం.  ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రక్రియ నామినేషన్ల నుంచి, మంజూరు, నమూనాల తయారీ, అవార్డు పంపిణీ ఇలా ప్రతి చోటా ఉదాశీనతే కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. ఈనెల 15న నామినేషన్ల స్వీకరణకు ఆఖరి గడువు. ఇప్పటి వరకూ 200 వరకూ మాత్రమే నామినేషన్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 


ఒక వైపు ఇష్టారాజ్యం.. మరోవైపు లోపించిన ఉత్సుకత

కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులకు ప్రోత్సాహకం అంది స్తుంది. అదేవిధంగా నామినేషన్లు భారీగా వెళ్లినా అవార్డు మంజూరులో కేంద్రం స్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఒక విధానం, సిద్ధాం తం, శాస్త్రీయత లోపించటం వల్లే చాలా మండలాలకు భారీగా అవార్డులు తగ్గాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని మండలాలకు ఎక్కువగా, కొన్ని మండలాలకు  తక్కు వగా వస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  కొంద రు టీచర్లు ప్రోత్సాహకం కింద వచ్చిన రూ.10 వేలు జేబు లో వేసుకుని, తూతూ మంత్రంగా నమూనాలు తయారు చేయించి కూడా ఈ ప్రక్రియను మసకబారుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయి తే గతంతో పోలిస్తే... అధి కారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, కేంద్రం విధానాలు, టీచర్లలో కొందరి అలసత్వం వల్ల ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రక్రియ పస లేకుండా సాగుతోందన్న అభిప్రాయం అధిక వర్గాల నుం చి వ్యక్తమవుతోంది. 2021-22 ఏడాదికి సంబంధించి 50 స్కూళ్ల నుంచి ఇప్పటి వరకూ 200 వరకూ మాత్రమే నా మినేషన్లు వచ్చాయి. గతంతో పోలిస్తే... ఇది చాలా తక్కువ నే చెప్పాలి. అధికారులు విద్యార్థులు, టీచర్లలో మరింత చైతన్యం, అవగాహన తేకపోతే ఈ ఏడాది అవార్డులు సైతం మరింత తగ్గే ప్రమాదమూ ఉంది.


బాల శాస్త్రవేత్తలకు భరోసా తగ్గుతోందా ?

6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదివే విద్యా ర్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికి తీసి శాస్త్రవేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఏటా ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులు అంది స్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ. 10 వేలు అందిస్తుంది. ఒక సరికొత్త ఆలోచనతో నూతన ఆవిష్కర ణకు నాంది పలికేందుకు ఈ ప్రోత్సాహం అందిస్తారు. తన మస్తిష్కకంలో మెదిలిన ఆలోచనకు రూపమిస్తూ ఒక నూతన యంత్రం, కొత్త మిషన్‌లేదా నవీన పద్ధతికి రూపం ఇస్తూ ఒక నమూనాను తయారుచేయాలి. అలా విద్యార్థులు తయారుచేసిన నమూనాలను ఇన్‌స్పైర్‌ ఎగ్జి బిషన్‌లో ఆవిష్కరిస్తారు. ఉత్తమ నమూనాలుగా ఎంపికైన వాటికి జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులు అందిస్తారు. అయితే రానురాను ఈ ప్రక్రియలో చైతన్యం లోపించడం, అవగా హన మునుపటిలా లేకపోవడం, టీచర్లు సైతం అంతగా శ్రద్ధ చూపకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రక్రియను నీరుగారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.


ఏడాది అవార్డుల రాష్ట్ర అవార్డులొచ్చిన 

మంజూరు విద్యార్థుల సంఖ్య

2011-12 780 78

2012-13 912 91

2013-14 559 56

2014-15 837 79

2015-16 804 80

2016-17 820 81

2017-18 420 41

2018-19 850 78

2019-20 318 31

2020-21 285 -



ఎంపికలో శాస్త్రీయత లోపించింది

గత కొన్నేళ్లుగా ఎంపిక విధానంలో  పొరపాట్లు జరుగు తున్నాయన్న ది మెజార్టీ టీచర్ల అభిప్రా యం. ముఖ్యంగా కేంద్రం స్థాయిలోనే ఎంపికలో శాస్త్రీయత లోపించింది. కొన్ని మం డలాలకు గంపగుత్తుగా వస్తే... కొన్ని మం డలాలకు ఆశించిన స్థాయిలో అవార్డులు రావడం లేదు. అలాకాకుండా ఒక శాస్త్రీయ విధానంలో రెండు, మూడు దశల్లో వడపోసి, మంచి నమూనాలు, రైటప్స్‌ చూసి అవార్డులు ఇవ్వాలి. మూసపద్ధతి  విడనాడాలి. అప్పుడే స మన్యాయం జరుగుతుంది. ఇన్‌స్పైర్‌ అవార్డులు అంటే విద్యార్థుల్లోనూ, టీచర్లలోనూ మరింత ఉత్సాహం కలుగు తుంది.

- చాగంటి చంద్రమౌళి,  ప్రధానోపాధ్యాయుడు, పాలవెంకటాపురం 


విద్యార్థులను మరింతగా భాగస్వామ్యం చేస్తాం

విద్యార్థుల్లో సృజన పెంచి, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు రాబట్టేందుకు ఈ స్కీం ఎంతగానో ఉపకరిస్తుంది. ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రక్రియలో విద్యార్థులు, టీచర్ల భాగస్వామ్యం మరింత పెంచేందుకు డీఈఓ శామ్యూల్‌ ఆధ్వర్యంలో మరింతగా కృషి చేస్తున్నాం. భావి శాస్త్రవేత్త లుగా పిల్లలు రాణించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. 

- ఆనంద భాస్కర్‌రెడ్డి, జిల్లా సైన్స్‌సెంటర్‌ ఆఫీసర్‌

Updated Date - 2021-10-11T06:33:28+05:30 IST