కొత్త పార్టీ పేరు ప్రకటించిన కెప్టెన్

ABN , First Publish Date - 2021-11-02T23:10:22+05:30 IST

చండీగఢ్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టేశారు.

కొత్త పార్టీ పేరు ప్రకటించిన కెప్టెన్

చండీగఢ్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టేశారు. పార్టీకి పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని పేరు పెట్టారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సిద్ధూకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు తన ప్రాధాన్యతకు అధిష్టానం చెక్ పెట్టడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సీనియర్‌నైన తనను కాంగ్రెస్ అధిష్టానం పక్కనపెట్టేయడాన్ని జీర్ణించుకోలేక చివరకు సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ పేరు ప్రకటించే ముందు కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు. సోనియాకు రాజీనామా లేఖ పంపారు. కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ అధిష్టానం పశ్చాత్తాప పడక తప్పదని కెప్టెన్ హెచ్చరించారు. సిద్ధూకు పాక్ పీఎంతో సాన్నిహిత్యం ఉందని ఆయన తీరు దేశానికి ప్రమాదకరమని కెప్టెన్ ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-11-02T23:10:22+05:30 IST