కట్టుదిట్టంగా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-06T06:21:50+05:30 IST

కట్టుదిట్టంగా కర్ఫ్యూ

కట్టుదిట్టంగా కర్ఫ్యూ
బెంజిసర్కిల్‌ వద్ద పోలీసుల పహారా

గుణదల, మే 4 : ఏపీలో బుధవారం నుంచి ప్రారం భించిన కర్ఫ్యూను పటమట పోలీసులు పక్కాగా అమలు చేశారు. మధ్యాహ్నం 12గంటల నుంచి  బెంజిసర్కిల్‌ వద్ద బందరురోడ్డుపై బ్యారికేడ్లు అడ్డుగా పెట్టి పహారా ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని ఆపి  ఆరా తీసి పంపించారు. పని లేకుం డా రోడ్డుమీదకు వచ్చే వారికి జరిమాన విఽధిస్తామని హెచ్చరించారు. పటమట సీఐ సురేష్‌రెడ్డి కర్ఫ్యూ సమయంలో పోలీసు సిబ్బంది అలసత్వం వహించ కుండా అంకితభావంతో పనిచేసి నగరాన్ని కరోనా రహిత నగరంగా తీర్చిదిద్దడంలో పోలీసుశాఖ ప్రధాన భూమిక కావాలని ఆకాంక్షిస్తున్నట్లు సిబ్బందికి సూచ నలు ఇచ్చారు. ప్రభుత్వ శాఖలు, ఎమర్జెన్సీ విభాగాల్లో పనిచేసే సిబ్బంది విధిగా ఐడీ ప్రూఫ్‌లు వెంట తెచ్చుకోవాలని ద్విచక్రవాహనాలపై వెళ్ళే వారికి సూ చించారు. ఇదే సమయంలో పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిదిలో రోడ్లమీదకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేస్తూ మైక్‌ద్వారా ప్రచారం చేయించారు. 

ఫ భారతీనగర్‌  :  కరోనా ఉధృతి పెరగడంతో  రాష్ట్రం ప్రభుత్వం బుధవారం నుంచి  కర్ఫ్యూను  విదించింది.   తొలిరోజు కావడంతో  పోలీస్‌ శాఖ  సమక్షంలో  మధ్యాహ్నం 12గంటల కల్లా  దుకాణాలు మూతపడ్డాయి. దీంతో ప్రదాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. 

కృష్ణలంకలో..

కృష్ణలంక : ప్రభుత్వం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రజలు, వ్యాపారస్తులు పోలీసులకు సహకరించి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దోహదపడాలని కృష్ణలంక సీఐ పి.సత్యానందం తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి రావడం వంటివి చేస్తే వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. హాస్పిటల్స్‌, మెడికల్‌ షాపులు, అంబులెన్స్‌ వంటి అత్యావసర సర్వీసులకు మాత్రమే వీటి నుంచి సడలింపు ఉంటుందని తెలిపారు.   కర్ఫ్యూ నియమాలను అతిక్రమించిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 188, విపత్తు నిర్వహణ చట్టం 51 నుంచి 58 ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ  తెలిపారు. 

బోసిపోయిన రోడ్లు

 విజయవాడ రూరల్‌  : కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి అమలు చేస్తున్న కర్ఫ్యూ విజయవాడ రూరల్‌ మండలంలో పూర్తిస్థాయిలో అమలైంది. మండలంలోని మేజర్‌ గ్రామాలలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి ప్రధాన రోడ్లన్నీ బోసిపోయాయి. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ తదితరశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించడంతోపాటు వారికి ప్రజల నుంచి కూడా సహకారం లభించింది.  మందుల దుకాణాలకు మినహాయింపు ఇవ్వడంతో ఆ షాపులు మినహా మిగిలిన దుకాణాలన్నీ మూతపడ్డాయి.  పాతపాడు, పీ నైనవరం, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి గ్రామాల్లోనూ నిర్మానుష్య వాతావరణం కనిపించింది. ఏలూరు రోడ్డులోని రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లిలో రోడ్లన్నీ బోసిపోయాయి. 

గన్నవరంలో..

గన్నవరం : కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన కర్ఫ్యూతో గన్నవరం పట్టణం నిర్మానుష్యంగా మారింది. ఉదయం 6 నుంచి 12గంటల వరకూ రద్దీగా ఉన్న ప్రాంతాలన్ని నిర్మానుష్యంగా మారాయి. తొలి రోజు కర్ఫ్యూ విజయవంతం అయ్యింది. పట్టణంలో జరుగుతున్న కర్ఫ్యూను ఈస్ట్‌జోన్‌ ఏసీపీ విజయపాల్‌ పర్యవేక్షించారు. సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ట్రాఫిక్‌ సీఐ రామచంద్రరావు, ఎస్సైలు పురుషోత్తం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ప్రభుత్వం ఇచ్చిన సమయానికే బడ్డీకొట్లు మూసివేసి అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. 

పెనమలూరులో  

పెనమలూరు :  మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధించారు. కామయ్యతోపు జంక్షన్‌లో పోలీసు సిబ్బందితో మోహరించారు. అకారణంగా రహదారులపై తిరిగే వాహనదారులను, ఆటోలను నిలువరించి కౌన్సెలింగ్‌ నిర్వహించి వెనక్కి పంపించారు. 

జాతీయ రహదారిపై చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలన్న ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకువీరవల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కోడూరుపాడు వద్ద జాతీయరహదారిపై చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్సై మదీనాబాషా తెలిపారు. కోడూరుపాడు గ్రామం వద్ద ఏర్పాటు చేసి న చెక్‌పోస్ట్‌లో బుధవారం మధ్యాహ్నం నుంచి ఆయన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రజా రవాణా వాహనాల రాకపోకలు నిషేధించిన మీదట సమయం దాటిన తరువాత ప్రజలు బయ టకు రావద్దని, ఆటోలలో ప్రయాణిం చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అత్య వసర పనులపై వెళ్లే వారు తమతోపాటు సంబందిత పత్రాలు, ధృవీకరణ కార్డు తప్పనిసరిగా చూపాలని మదీనాబాషా సూచించారు. 

హనుమాన్‌ జంక్షన్‌లో..

 హనుమాన్‌జంక్షన్‌ : కరోనా కట్టడి కోసం  ప్రభు త్వం విధించిన  కర్ఫ్యూ  అమలులో వర్తక వ్యాపార వర్గాలతో పాటు ప్రజానీకం భాగస్వామ్యం కావాలని  హనుమాన్‌జంక్షన్‌ సీఐ డీవీ.రమణ  కోరారు. బుధ వారం హనుమాన్‌జంక్షన్‌ సెంటర్‌లో   మధ్యా హ్నాం 12 గంటల నుంచి అమలు చేసిన కర్ఫ్యూను పరిశీ లించారు. ఉదయం 6 గంటల నుంచి  మధ్యాహ్నాం 12 గంటల వరకు ఇచ్చిన సడలింపు సమయాన్ని ప్రజలు తమ దైనందిన  కార్యక్రమాలకు సద్విని యోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ నిర్వహా ణపై ఎస్సైలు చంటిబాబు, ఉషారాణిలతో  సమీక్షిం చారు.  కర్ఫ్యూను  పగడ్బందీగా అమలు చేయాలని  ఆదేశించారు.

  నిబంధనలు పాటించండి 

కంకిపాడు : కర్ఫ్యూ పాటించకుంటే లైసెన్సులు రద్దు చేస్తామని తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ హెచ్చరించారు. కంకిపాడు సెంటర్‌లోని గన్నవరం రోడ్డు, బందరు రోడ్డు, లాకు రోడ్డులో బుధవారం ఎస్సై దుర్గారావుతో ఆయన పర్యటించారు. షాపుల యజమానులతో మాట్లాడారు. దుకాణాల్లో భౌతిక దూరం పాటించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.  దూరం పాటించకపోయినా, మాస్కులు ధరించకపోయినా షాపు లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు, ఇతర వాహనాలు వారు కూడా మధ్యాహ్నం 12 గం టల తరువాత బయటకు రావద్దన్నారు.    రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-06T06:21:50+05:30 IST