వ్యాక్సిన్‌ పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-12-04T05:48:58+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీకి అధికారులు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

వ్యాక్సిన్‌ పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టాలి
డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌

గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి):  కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీకి అధికారులు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ జిల్లా టాస్కుఫోర్సు కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. వ్యాక్సిన్‌ని భద్రపరించేందుకు అవసరమైన కోల్డ్‌స్టోరేజ్‌ పాయింట్స్‌ గుర్తించాలని ఆదేశించారు. కోల్డ్‌ఛైన్‌ ఎక్విప్‌మెంట్‌, వ్యాక్సినేటర్స్‌ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ వాహనాలు వంటి సదుపాయాలపై కలెక్టర్‌ డీఎంహెచ్‌వోని అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం వ్యాక్సిన్‌ భద్రపరించేందుకు అవసరమైన సౌకర్యాలపై డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ కార్యక్రమంలో జేసీలతో పాటు డీఆర్వో సీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి రత్నమోహన్‌, అదనపు డీఎంహెచ్‌వో జైసింహా, డీఈవో గంగాభవాని, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బీ మనోరంజని పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T05:48:58+05:30 IST