జిల్లాలో 863 మందికి కరోనా వైరస్‌

ABN , First Publish Date - 2020-08-05T10:28:25+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్‌ కేసులు 15 వేల మార్క్‌ను దాటేశాయి.

జిల్లాలో 863 మందికి కరోనా వైరస్‌

15,471కు చేరిన పాజిటివ్‌ కేసులు

గత మూడు రోజులతో పోలిస్తే స్వల్పంగా తగ్గిన కేసులు


 విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్‌ కేసులు 15 వేల మార్క్‌ను దాటేశాయి. గత నెల నాలుగో  తేదీనాటికి మొత్తం 1,238 కేసులు నమోదుకాగా, ఈ నెల రోజుల్లోనే సుమారు 14 వేల మంది వైరస్‌బారిన పడ్డారు. మంగళవారం 863 మంది కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజులతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 15,471కి చేరింది. వీరిలో 6,561 మంది డిశ్చార్జ్‌ కాగా, 8,844 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం మరో ఐదుగురు మృతి చెందడంతో కొవిడ్‌ మరణాలు 106కి చేరాయి చేరింది. 


అనకాపల్లిలో కరోనా స్వైర విహారం .. మరో 59 మందికి వైరస్‌ 

అనకాపల్లిలో కరోనా వైరస్‌ స్వైరవిహారం చేస్తున్నది. మంగళవారం మరో 59 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 54 మంది పట్టణానికి చెందినవారు కాగా ఐదుగురు మండలానికి చెందిన వారు. గవరపాలేనికి చెందిన 27 మంది వ్యక్తులు (54), (36), (26), (25), (20), (53), (44), (44), (28), (25), (21),  (26), (53), (44), (55), (28), (25), (38), (26), (54), (62), (60), (54), (36), (26), (25), (20), విజయరామరాజుపేటకు చెందిన వ్యక్తి (54), మల్లిమణుగులవారివీధిలో వ్యక్తి(32), మశీదువీధిలో మహిళ(19), కస్పావీధిలో ఇద్దరు(65), (34), నర్సింగరావుపేటలో వ్యక్తి (22), వేల్పులవీధిలో బాలుడు (9), గాంధీనగరంలో ఇద్దరు(25), (48), కోట్నివీధిలో వ్యక్తి (35), నలుగురు మహిళలు(35), (70), (27), (70), (32), న్యూకాలనీలో మహిళ (51), ఇద్దరు వ్యక్తులు (52), (46), మద్దాల రెసిడెన్సీలో వ్యకి ్త(38), అంబేడ్కర్‌నగర్‌లో వ్యక్తి (28), చిన్నవీధిలో వృద్ధుడు(60), భీమునిగుమ్మంలో వృద్ధుడు(60), మహిళ(37), తాకాశివీధిలో ఇద్దరు(32), (32), లక్ష్మీదేవిపేటలో 24 ఏళ్ల ఇద్దరు యువకులకు పాజిటివ్‌  నిర్ధారణ అయింది. మండలంలోని దిబ్బపాలేనికి చెందిన వ్యక్తి(49),  తుమ్మపాలలో వ్యక్తి(36), జగన్నాథపురంలో వ్యక్తి(31), కుంచంగి వ్యక్తి(25),  బీఆర్‌టీ కాలనీలో వృద్ధుడు(60) కరోనా వైరస్‌బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 589కి చేరింది.


పారిశ్రామిక ప్రాంతంలో 34.. 

 పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం 34 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 46, 47 వార్డుల్లో 21 మందికి, 49వ వార్డులో 13 మందికి పాజిటివ్‌ అని తేలింది.


చినవాల్తేరు పరిధిలో 28 కేసులు..

చినవాల్తేరులోని వాల్తేరు-2 జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో చినవాల్తేరు, రెల్లీవీధి, పాండురంగపురం, ఏయూ అవుట్‌గేటు, చేపలమార్కెట్‌, చినవాల్తేరు రజకవీధి ప్రాంతాలకు చెందిన 100 మందికి కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా, వారిలో 28 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 


గోపాలపట్నంలో 25 మందికి..

గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో మంగళవారం 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాతగోపాలపట్నంలో ఏడు, శ్రీనుబాబునగర్‌లో మూడు, నరసింహనగర్‌లో రెండు, శ్రీరామ్‌నగర్‌లో ఒకటి, వుడాకాలనీలో ఒకటి, రామకృష్ణానగర్‌లో ఐదు, లక్ష్మీనగర్‌లో ఒకటి, అజంతాపార్క్‌లో ఒకటి, ఇందిరానగర్‌లో నాలుగు నమోదయ్యాయి. 


మన్యంలో మరో 25  కేసులు 

పాడేరు ఏజెన్సీలో మరో 25 కరోనా కేసులు నమోదయ్యాయని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ లీలాప్రసాద్‌ తెలిపారు. మంగళవారం 155 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 25 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. దీంతో ఏజెన్సీలో 215 మంది వైరస్‌బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు మృతిచెందారు. 


మురళీనగర్‌, మాధవధారల్లో 24..

మాధవధార, మురళీనగర్‌ ప్రాంతాల్లో 24 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మాధవధార, వుడా కాలనీల్లో నలుగురు, సీతన్న గార్డెన్స్‌లో నలుగురు, గాంధీనగర్‌లో ఒకరు, తెన్నేటినగర్‌లో ఒకరు, మాధవధార మాన్యం ప్రాంతంలో ముగ్గురు, మురళీనగర్‌లో ఇద్దరు, వార్డు సచివాలయం నంబరు 281 పరిధిలో ఇద్దరు, ఎల్‌బీ నగర్‌లో ఒకరు, పట్టాభిరెడ్డితోటలో ఒకరు, కామాక్షినగర్‌లో ఒకరు, బర్మాకాలనీలో నలుగురికి పాజిటివ్‌ అని తేలింది. 


నర్సీపట్నం ఆర్డీవోతో సహా 9 మందికి కరోనా

నర్సీపట్నంలో ఆర్డీవో(48)తో సహా తొమ్మిది మంది కరోనా బారినపడ్డారు. వెంకునాయుడుపేటలో వ్యక్తి(38), గవరవీధిలో యువకుడు(23), మహిళ(30), అయ్యన్నకాలనీలో ఒకే  కుటుంబానికి చెందిన వ్యక్తి (47), వృద్ధురాలు(72), పెదబొడ్డేపల్లిలోవ్యక్తి(39), జోగినాథునిపాలెంలో 27 ఏళ్ల ఇద్దరు వ్యక్తులకు వైరస్‌ సోకింది. 


ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రి పరిధిలో 20..

 ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో వంద మందికి పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఆరిలోవ, సంతపాలెం, చినగదిలి, పైనాపిల్‌ కాలనీ, రామకృష్ణాపురం ప్రాంతాలకు చెందిన వారున్నారు. 


సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 12..

సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 72, 69 వార్డులకు చెందిన 65 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  


తాటిచెట్లపాలెంలో 11..

తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో 11 మంది కరోనా వైరస్‌బారిన పడ్డారు. తాటిచెట్లపాలెంతోపాటు నందగిరినగర్‌, వెంకటేశ్వర కాలనీ, శ్రీనివాసనగర్‌ తదితర ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయని జీవీఎంసీ అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. 


పద్మనాభంలో తొమ్మిది.... 

పద్మనాభం మండలంలో తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. పద్మనాభంలో ఐదుగురికి, ఆర్‌వీ పురంలో ముగ్గురికి, నరసాపురంలో ఒకరికి కరోనా సోకింది. 


ఎలమంచిలిలో ఏడు పాజిటివ్‌లు

ఎలమంచిలి పట్టణంలో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మునిసిపల్‌ ప్రజారోగ్య అధికారి చిట్టిబాబు తెలిపారు. ఎస్‌బీఐ న్యూకాలనీలో మహిళ(41), ఇద్దరు యువకులు(20, 18), ధర్మవరంలో యువకుడు(23), పట్టణంలో యువకుడు(22), తులసీనగర్‌లో వ్యక్తి(49), యువతి (18)లకు పాజిటివ్‌ వచ్చిందన్నారు.


అనంతగిరిలో ఆరు..  

అనంతగిరి మండలంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతగిరిలో ముగ్గురు ఏపీఎస్‌పీ పోలీసులతోపాటు, ఇటీవల పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి భార్యకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తైడాలో రైల్వే ఉద్యోగి, గుమ్మకోటలో యువకుడు వైరస్‌బారిన పడ్డారు. 


 ఆనందపురంలో ఐదు..

ఆనందపురంలో రెండు, వేములవలసలో రెండు, ఎల్‌వీ పాలెంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైనట్టు ఎంపీడీవో లవరాజు తెలిపారు. 


మాడుగులలో ఐదు.. 

మాడుగుల మండలం కేజేపురం పీహెచ్‌సీలో 30 మందికి కరోనా  పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు మాడుగుల, ఇద్దరు కేజేపురం వాసులు వున్నారు. 


పాయకరావుపేటలో నాలుగు కేసులు నమోదయ్యాయి. పాయకరావుపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు(28, 24, 30), నామవరం గ్రామానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి వైరస్‌బారిన పడ్డారు.


చోడవరం పట్టణంలోని బాలాజీనగర్‌లో ఒక యువతి, గోవాడ గ్రామంలో ఇద్దరు వైరస్‌బారిన పడ్డారు.


మునగపాక మండలం నాగులాపల్లిలో వ్యక్తి(34), కొత్తనాగవరంలో యువకుడు(31) వైరస్‌బారిన పడినట్టు వైద్యాధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు. 


రావికమతం మండలం దొండపూడిలో ఒక యువకుడు(32) వైరస్‌బారిన పడ్డాడు. 


గొలుగొండ మండలం ఏఎల్‌పురం పంచాయతీలో కారు డ్రైవర్‌కు(35) పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. 


దేవరాపల్లి మండలం కేఎం.పాలెంలో ఒక వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి ఎస్‌.లలిత తెలిపారు.   


చింతపల్లి మండలం కృష్ణాపురంలో ఒకరు వైరస్‌బారిన పడ్డారని లంబసింగి పీహెచ్‌సీ వైద్యాధికారులు మారమ్మ, నీరజ తెలిపారు.


కోటవురట్ల మండలం పాములవాకలో ఒక యువకుడి(33)కి వైరస్‌ నిర్ధారణ అయినట్టు వేములపూడి వైద్యాధికారి సుజాత తెలిపారు. 


పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలో 47 ఏళ్ల మహిళ వైరస్‌బారిన పడినట్టు వైద్యాధికారి మధుబాబు తెలిపారు.


ఎస్‌.రాయవరం మండలం బంగారమ్మపాలెంలో మహిళ ఒకరు వైరస్‌బారిన పడినట్టు ఈవోపీఆర్‌డీ త్రిమూర్తులు తెలిపారు. 


పరవాడ మండలం వెన్నెలపాలెం పంచాయతీ హనుమాన్‌ కాలనీలో వ్యక్తి(36) వైరస్‌బారిన పడ్డాడు.

Updated Date - 2020-08-05T10:28:25+05:30 IST